Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ పేరు చెపితే ఝిల్లుమనాలి: దీపికా పదుకునే

Advertiesment
దీపికా పదుకునే
"ప్రేమ" అనే పదానికి ఎందరో.. ఏవేవో అర్థాలు చెబుతుంటే.. బాలీవుడ్ సౌందర్యరాశి దీపికా పదుకునే కూడా వారి మాదిరిగానే ప్రేమకు కొత్త అర్థాలను చెపుతోంది. " నేను ప్రేమ అనే భావనను నమ్ముతాను. కుటుంబ సంబంధాలు, వివాహవ్యవస్థలను ఎంతగా నమ్ముతానో ప్రేమను కూడా అలాగే నమ్ముతాను" అని అంటోంది. 

"నా దృష్టిలో నిజమైన ప్రేమ ఒక్కసారే పుడుతుంది. ఇది నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి చెబుతున్నాను. అసలు ప్రేమ పేరు చెబితే మనసు, శరీరం ఒక్కసారిగా ఝిల్లుమనాలి" అని దీపికా స్పష్టం చేసింది. మరి నీకెప్పుడు ఝిల్లుమంటుందీ...? అని ప్రశ్నిస్తూ కారాలు మీరాలు నూరుతూ కొరకొరా చూసింది.

ఆ తర్వాత సంభాళించుకుంటూ... ప్రేమను మరో కోణంలో చూసేవారు కూడా లేకపోలేదని, అది వారి అభిప్రాయమనీ, దాన్ని తను వ్యతిరేకించనని దీపికా పదుకునే స్పష్టం చేస్తోంది. తాజాగా కన్నడలో ఉపేంద్ర సరసన నటించిన దీపిక తెలుగులో "లవ్ ఫర్ ఎవర్" అనే చిత్రంలో ప్రత్యేక సాంగ్ చేస్తోంది. ఇంకా "బాయ్స్" బాయ్ సిద్ధార్థతో కలిసి కె. రాఘవేంద్రరావు నిర్మిస్తోన్న చిత్రంలోనూ దీపికా పదుకునే నటిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu