తన చెల్లెలికి డైరెక్టుగా సినిమా అవకాశం ఇవ్వమని అడిగితే ఎవరు ఎలా స్పందిస్తారోనన్న సందేహమో ఏమోగానీ మగధీర "బంగారు కోడిపెట్ట" ముమైత్ ఖాన్ తన సోదరిని వెరైటీగా ప్రొజెక్ట్ చేస్తోంది. టాలీవుడ్‌లో జరిగే ఆయా ఫంక్షన్లకు సోదరి జుబెన్‌ను వెంటబెట్టుకుని వెళుతోంది. పలుకరించనివారిని కూడా పలుకరిస్తూ తన చెల్లల్ని వారికి పరిచయం చేస్తోంది.
తన చెల్లెలికి తనకంటే ఎక్కువ టాలెంట్ ఉందన్న భావనను ఎదుటివారికి కలిగే విధంగా ప్రవర్తిస్తోంది. జుబెన్ కూడా ఓ అడుగు ముందుకేసి సినిమావాళ్ల ప్రవర్తన ఎలా ఉండాలో అలా మెలగుతూ అందరి కళ్లల్లో పడేందుకు యత్నిస్తోంది.
అవును... తమ్ముళ్లకోసం అన్నయ్యలు, చెల్లెళ్లకోసం అక్కలు కష్టపడుతూనే ఉంటారు. సినిమాల విషయానికి వస్తే... మెగాస్టార్ తన తమ్ముళ్లను సినీరంగంలో పరిచయం చేసి నిలదొక్కుకునేటట్లు చేశారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే... నగ్మా, ఆర్తీ అగర్వాల్ వంటి తారలు ఎందరో తమ చెల్లెళ్లను వెండితెరకు పరిచయం చేసేందుకు నానా తంటాలు పడ్డారు.