Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాసిప్స్ కోసం వెతుకుతాను: విమలా రామన్

Advertiesment
హాట్ నటి
తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటిస్తున్న విమలారామన్ తాజాగా తరుణ్‌తో "చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి"లో నటిస్తోంది. ఈ చిత్రానికి ముగ్గురు దర్శకులు మారారు. ఆ విషయం అలా ఉంచితే... ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఫారిన్‌లో చిన్నపాటి తగాదా అయింది. 

ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్నది సారాంశం. ఆ విషయాన్ని రెండవ దర్శకుడు వి.ఎన్. ఆదిత్య కూడా ధృవీకరించారు. అయితే విమలా రామన్ మాత్రం "గాసిప్స్ నిజమని నేననుకోను. నిజమయితే గాసిప్స్ ఎందుకవుతాయ"ని ప్రశ్నిస్తోంది.

కాకపోతే విశేషం ఏమిటంటే... కొంతమంది తమ అమూల్యమైన సమయాన్ని తన గురించి కేటాయిస్తున్నారంటే తానెంతో ఎత్తుకు ఎదిగోనని గాసిప్స్ కూడా ఒక ఎసెట్‌గా ఫీలవుతూ చెబుతోంది. ఒకరకంగా గాసిప్స్‌ను బట్టి తనను తాను తెలుసుకోగలుగుతాననీ, అవన్నీ చదివితే ఎలా ఉండాలో గైడ్‌లైన్స్‌గా ఉంటాయని అంటోంది. అందుకే అవన్నీ జాగ్రత్తగా నెట్ ముందు కూర్చుని చూస్తుంటానని గర్వంగా చెపుతోంది.

Share this Story:

Follow Webdunia telugu