Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?

Advertiesment
AA22- Allu Arjun
AA22- Allu Arjun
రేపు అనగా ఏప్రిల్ 8వ తేదీ బుధవారంనాడు అల్లు అర్జున్ పుట్టినరోజున ఆయన AA22 టైటిల్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు సన్ పిక్చర్స్, దర్శకుడు అట్లీ ప్రకటించారు. ఈ చిత్రం గురించి మరో అప్ డేట్ ను పోషల్ మీడియా వేదికగా పొందుపరిచారు. కొద్ది సేపటి క్రితమే అల్లు అర్జున్ ముంబై ఎయిర్ పోర్ట్ లో కారు దిగుతూ వస్తున్న ఫొటోను షేర్ చేశారు. తెల్లటి దుస్తులతో వున్న ఆయన తన అభిమానులను అలరించారు. 
 
ఇక AA22 చిత్రంస్పైడర్-మ్యాన్, అవెంజర్స్ బృందాల నుండి హాలీవుడ్-స్థాయి విఎఫ్ఎక్స్ తో, భారతదేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలవనుందని తెలుస్తోంది. రాకాసి తరహా చేయిను కూడా విడుదల చేశారు. ఆ చేయిను తన చేతికి ఏవిధంగా తగిలించుకుంటున్నాడో కూడా విడుదలైంది.
 
తాజా సమాచారం మేరకు దీపికా పడుకోన్ ఒక యోధురాలి పాత్రలో కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కూడా నటించే అవకాశం ఉంది.  ఒక డార్క్, ఫాంటసీ కథను  సైన్స్ ఫిక్షన్ యాక్షన్ తరహాలో వుంటుందని తెలుస్తోంది.  సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న AA22లో అల్లు అర్జున్ మొదటిసారిగా దర్శకుడు అట్లీతో చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం