Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rajasab loss: తెలంగాణాలో రాజా సాబ్ ప్రివ్యూలను అడ్డుకున్నదెవరు? నష్టపోయిన నిర్మాత

Advertiesment
Mytri movies theater Hyderabad

దేవీ

, శుక్రవారం, 9 జనవరి 2026 (13:13 IST)
Mytri movies theater Hyderabad
తెలుగు సినిమాకు ఆంధ్ర, తెలంగాణకు ప్రాణం. కానీ నిన్న జరిగిన పరిణామం వల్ల ప్రభాస్ నటించిన రాజా సాబ్ విషయంలో ఓ లోపం జరిగింది. ఆంధ్రలో ప్రీమియర్స్ వేయడానికి అనుమతి లభించడంతో గత రాత్రి 8.30 గంలనుంచే షోలు ప్రదర్శించబడ్డాయి. కానీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. దానికి కారణాలు ఏమైనా చిత్ర నిర్మాతల ప్లానింగ్ లేకపోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
ఇంతకుముందు బాలక్రిష్ణ సినిమా అఖండ2 విషయంలో తలెత్తిన ప్రీమియర్స్ షో లు కేన్సిల్ కావడంతో అసలు సమస్య తలెత్తింది. ఆ సినిమా అసలు డేట్ కంటే వారం తర్వాత రిలీజ్ కావడంతో గతంలో అనుకున్నట్లుగా టికెట్ల రేట్లు పెంచారు. కానీ ప్రభుత్వం లెక్కల ప్రకారం వారం తర్వాత మరోసారి నిర్మాతలు అర్జీలు పెట్టుకోవాలి. కానీ సంబంధిత మంత్రి మాత్రం అఖండ 2 రిలీజ్ సమయంలో నేను హైదరాబాద్ లో లేను ఇక్కడ అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నారో నాకు తెలీదు అని వ్యాఖ్యానించారు.
 
ఇక నేడు జరిగిన సీన్ కూడా అంతే నని తెలిసింది. రాజాసాబ్  విషయంలో టికెట్ల రేట్ల పెంపుపై సినిమాటోగ్రఫీ మంత్రి సంతకం చేశారనీ, ఆ తర్వాత ఆయన అందుబాటులో లేరనీ, గోవాలో వున్నానని చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలియజేస్తున్నాయి. దానితో ఈ తంతంగా అంతా అయ్యేసరికి రాత్రి 8 గంటలు దాటిందట. ఫైనల్ గా పోలీసు కమీషనర్ సివి ఆనంద్ ప్రీమియర్ పెంపు, టికెట్ల రేట్ల పెంపుపై కూడా సంతకాలు పెట్టాలి. ఆయన కూడా సరియైన సమయంలో అందుబాటులో లేకపోవడంతోపాటు ప్రీమియర్స్ కు టైమ్ కూడా అవడంతో తెలంగాణాలో ప్రీమియర్స్ వాయిదా పడ్డాయని తెలిసింది.
 
ఇదిలా వుండగా, రాత్రి 9గంటల తర్వాత ప్రీమియర్స్ వేస్తున్నారని ఓ సోషల్ మాధ్యమంలో వార్త రావడంతో సమయం సరిపోకపోవడంతో ప్రీమియర్స్ రాత్రి పడలేదు. ఎట్టకేలకు రాత్రి 10.30 నిముషాలకు మైత్రీమూవీస్ థియేటర్ లో ప్రదర్శిస్తున్నారని తెలియడంతో అప్పటికే థియేటర్ల దగ్గర వున్న అభిమానులు పోటెత్తారు. ఇక వారికి కంట్రోల్ చేయడం పోలీసులకు, థియేటర్ యాజమాన్యానికి పెద్ద సవాల్ గా మారింది.
 
అభిమానులంతా గేట్లు పైనుంచి దూకుతూ నెట్టుకుంటూ థియేటర్ లోపలికి వెళ్ళి కూర్చుండిపోయారు. ఒకరకంగా  ఈ విషయంలో అటు పోలీసులు, ఇటు యాజమాన్యం సరైన ప్రణాళిక లేకపోవడమే అనే విమర్శలు వెల్లువెత్తాయి. థియేటర్ బయట మాత్రం రాత్రి 12 తర్వాత పర్మిషన్ వస్తుందని టాక్ రావడంతో అప్పటికి డేట్ మారిపోతుంది కాబట్టి, జీవో వచ్చినా రాకపోయినా సినిమా అదంట అదే ప్రదర్శితమవుతోంది. దాని కోసం అటు ప్రేక్షకులు దాదాపు మూడు గంటలపాటు వెయిల్ చేయాల్సివచ్చింది.
 
ఫైనల్ గా పోలీసులు వచ్చి అభిమానులను థియేటర్లనుంచి బటయకు పండంతో సినిమా 12 గంటల తర్వాత ప్రదర్శించారు. సినిమా అంతా అయ్యేసరికి తెల్లవారుజామున 4 గంటలయింది. 
 
మొత్తంగా చూస్తే నాటకీయ పరిణామాల మధ్య రాజా సాబ్ సినిమా టికెట్ ధరల పెంపు జరిగింది.  అర్ధరాత్రి 12 గంటల తరువాత ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.  9వతేదీ అనగా శుక్రవారం నుండి ఈ నెల 11వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీప్లెక్స్ ల్లో రూ.132 పెంచుకునేందుకు, ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్స్ ల్లో రూ.89 పెంచుకునేందుకు అనుమతులు 
 
సినిమా విడుదల చివరి నిమిషం వరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోవడం వెనుక ఓ మహారాజు లాంటి  కుట్ర కోణం ఉందని  ప్రభాస్ అభిమానులు మండిపడుతూ థియేటర్ల దగ్గర నినాదాలు చేశారు. సినిమా విడుదలయ్యాక ఒక్కరోజులోనే 100 కోట్ల గ్రాస్ వస్తుందని నిర్మాత విశ్వప్రసాద్ ప్రకటనకు బ్రేక్ పడడంతో దాదాపు 10 కోట్ల మేర నష్టం ఏర్పడిందని ఇది దురద్రుష్టకరమేనని అభిమానులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Niharika Konidela: నిహారిక కొణిదెల‌ నిర్మిస్తోన్న‌ చిత్రం రాకాస