Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీడి దుంప తెగ... నయనతార బెడ్రూంలో పట్టుబడాలని ఉందట...

వీడి దుంప తెగ... నయనతార బెడ్రూంలో పట్టుబడాలని ఉందట...
, సోమవారం, 21 జులై 2014 (14:43 IST)
నయనతార బెడ్రూంలో తను పట్టుబడితే బావుంటుందని ఓ కోలీవుడ్ సినీ హీరో కోరుకుంటున్నాడు. నయనతార అంటే కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు చొంగ కార్చుకోవడం ఎక్కువే. అంత వెర్రిగా నయనను అభిమానిస్తుంటారు చాలామంది. 
 
తాజాగా ఈ లిస్టులో కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి చేరిపోయాడు. విజయ్ సేతుపతి అంటే ఎవరూ అని అనుకునేరు.. ఇతగాడు పిజ్జా అనే సినిమాలో నటించాడులెండి. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పిజ్జా పిల్లోడుకు ఫాలోయింగ్ బాగానే ఉంది. ఫాలోయింగ్ ఉందంటే ఛానళ్లు ఊరుకుంటాయా ఏంటి... వెంబడించవూ. అలాగే ఓ చానల్ కు సంబంధించిన యాంకర్ అతడిని ఓ ప్రశ్న వేసింది.
 
రియల్ లైఫ్ లో పోలీసులు నిన్ను పట్టుకుంటే ఎక్కడ పట్టుబడాలని ఉంది అంటూ చిత్రమైన ప్రశ్నాస్త్రం సంధించింది. అందుకు అతడు ఏం చెప్పాడో తెలుసా...? నయనతార బెడ్‌రూంలో దొరికితే బాగుంటుందని టక్కున చెప్పేశాడు. అక్కడే ఎందుకు దొరకాలనుకుంటున్నానంటే... తన అందం అలాంటిది అని చెప్పి తెగ సిగ్గుపడి పోయాడట. అతడు ఇలా చెప్పినట్లు తమిళ పేపర్లు తెగ రాస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu