Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రానా - త్రిషల రహస్య ప్రేమాయణానికి ఫుల్‌స్టాఫ్?

రానా - త్రిషల రహస్య ప్రేమాయణానికి ఫుల్‌స్టాఫ్?
, బుధవారం, 22 అక్టోబరు 2014 (15:03 IST)
టాలీవుడ్ హీరో రానా, హీరోయిన్ త్రిషల మధ్య సాగిన ప్రేమాయణానికి బ్రేక్ పడినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. నిజానికి వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్టు చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, తాము కేవలం స్నేహితులమేనని వీరిద్దరూ వాదిస్తూ వచ్చారు. 
 
అయినప్పటికీ.. ఫిలిం అవార్డ్ ఫంక్షన్స్, ఐపీఎల్, మూవీ ప్రీమియర్స్, ఈవెంట్స్, రెస్టారెంట్స్, పార్టీలకు ఇద్దరు కలసి వస్తుండటంతో వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని మీడియాలో అనేక కథనాలు వస్తాయి. ఫిల్మ్ నగర్ కూడా కోడై కూసింది. అయితే, తాజాగా రానా, త్రిషల ప్రేమాయణానికి బ్రేక్ పడిందని తెలుస్తోంది. 
 
సోషల్ మీడియాలో వీరద్దరూ ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి వీరి మధ్య వ్యవహారం చెడిందనే భావించాల్సి వుంది. రానా, త్రిషలు ఇరువురు ట్విట్టర్‌లో నిన్నమొన్నటి వరకు ఒకరినొకరు ఫాలో అయ్యేవారు. అయితే, ఇటీవల కాలంలో రానా త్రిషను అన్ ఫాలో చేయగా, త్రిష కూడా రానాను అన్ ఫాలో చేసింది. అలాగే, ఇటీవల కాలంలో వీరిద్దరూ ఇస్తున్న ట్వీట్స్ కూడా వీరిద్దరు విడిపోయారనే భావనను బలపరుస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu