Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

20 ఏళ్ళ దానిలా త్రిష... ముఖ్యమంత్రి జయలలితలా నటిస్తుందా..?!!

20 ఏళ్ళ దానిలా త్రిష... ముఖ్యమంత్రి జయలలితలా నటిస్తుందా..?!!
, మంగళవారం, 13 అక్టోబరు 2015 (14:12 IST)
త్రిష కొత్తగా ప్రయత్నాలు చేస్తుంది. హారర్‌ తరహాలో సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం పేరు నాయకి. అంటే నాయకురాలు కథా నేపథ్యంలో అనుకుంటే పొరపాటు. ఇందులో ఆమె పాత్ర చాలా భిన్నంగా వుంటుందట. 20 ఏళ్ళ చిన్నదానిలా ఆమె కన్పించనుంది. బహుశా రెండు పాత్రలు పోషిస్తుంటుందని అనుకుంటున్నారు. 
 
ఇటీవలే మహాబలిపురంలో కొంత వర్క్‌ చేసుకుని తిరిగి వచ్చారు. తమిళం, తెలుగు భాషల్లో నిర్మించబడతున్న ఈ చిత్రాన్ని గంగాధర్‌ నిర్మిస్తున్నారు. టైటిల్‌కు తగినట్లుగా ఆమె పాత్ర వుంటుందనీ, ఇప్పటివరకు ఎవ్వరూ చేయని పాత్రను ఆమె చేస్తుందని నిర్మాత తెలియజేస్తున్నారు. కాగా ఈ నాయకి పాత్ర తమిళనాడు ముఖ్యమంత్రికి దగ్గర పోలికలు ఉన్నాయని కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. మరి నిజమేంటో...?

Share this Story:

Follow Webdunia telugu