Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రానా బ్రేకప్ తో త్రిష మెంటల్ గా దెబ్బతిందట...

రానా బ్రేకప్ తో త్రిష మెంటల్ గా దెబ్బతిందట...
, శనివారం, 15 నవంబరు 2014 (15:13 IST)
ఆ మధ్య ట్విట్టర్ లో రానా, త్రిషలు ఒకరిపై ఒకరు పరోక్షంగా కామెంట్లు చేసుకున్నారనే ప్రచారం జరిగింది. ఇపుడు మరోసారి త్రిష గురించి కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. అంతకంటే ముందు ఓ పత్రిక అయితే త్రిషను పనిమాలా ప్రేమ గురించి గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేసేసింది. దీంతో త్రిష తనకు ప్రేమపై అభిప్రాయాన్ని మొత్తం చెప్పేసింది. 
 
తనకు ప్రేమపై నమ్మకం పోయిందనీ, ప్రేమ రిస్క్‌తో కూడిన వ్యవహారమనీ, కెరియర్‌ను మానుకుని ప్రేమ కోసం అధిక సమయాన్ని కేటాయిస్తే ఆ ప్రేమ సక్సస్ కాకపోతే పరిస్థితి ఏమిటి అంటూ ఆందోళన చెందుతూ చెప్పిందట.
 
ఇంకేముందీ... ప్రేమలో త్రిష విఫలమవ్వటం వలనే ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంటూ కోలీవుడ్ కోడై కూస్తోంది. త్రిష మాటలను కొందరైతే రానాతో జరిగిన ప్రేమ బ్రేకప్ వ్యవహారం వల్లనే ఆమె మానసిక పరిస్థితిని బాగా దెబ్బ తీసిందంటూ త్రిషపై కామెంట్లు గుప్పిస్తున్నారట.

Share this Story:

Follow Webdunia telugu