Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్టీల్లో తేలుతున్న యువ హీరోలు... డిన్నర్ పార్టీలు కాదులే....

పార్టీల్లో తేలుతున్న యువ హీరోలు... డిన్నర్ పార్టీలు కాదులే....
, మంగళవారం, 24 నవంబరు 2015 (18:45 IST)
యువ రక్తం అంటేనే సరదాగా ఎంజాయ్‌ చేయడం. హీరో రేంజ్‌ పెరిగాక వారి అలవాట్లు మామూలుగా వుండవు. ఇప్పుడున్న యూత్‌ హీరోలు తమకుతాము ప్రమోట్‌ చేసుకునేందుకు ఓ వేదిక కావాలి. అందుకోసం రహస్యంగా కొందరు కలిసి పార్టీలు చేస్తూ.. తమ కెరీర్‌ను ప్లాన్‌ చేసుకుంటున్నట్లు సమాచారం. వీరంతా మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ సభ్యులు కావడం విశేషం. అందులో అల్లు అర్జున్‌, రానా, మంచులక్ష్మితో పాటు పలువురు వున్నారు. 
 
వారంతా వీకెండ్‌ సినిమాల గురించి చర్చించుకుంటారు. ఒకరి చిత్రం మరొకరి చిత్రానికి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటారు. ఆ కోవలో ఇటీవలే కొన్ని సినిమాలు వాయిదా పడేలా ప్లాన్‌ చేసుకున్నారు. అందులో రవితేజను కూడా కలిపారు. ఇకపోతే వారంతా ఇలా ప్లాన్‌ చేసుకోవడం 'మా' అసోసియేషన్‌ దృష్టికి వెళ్ళింది. 
 
ఈ విషయంలో వారికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా వారు చేసేదేమీలేదు. ముఖ్యంగా లంచ్‌ పార్టీలు ఎక్కువగా వుంటున్నాయి. డిన్నర్‌ పార్టీలు ఈమధ్య తగ్గాయి. అందుకు కెరీర్‌ పరంగా ఎవరికివారే బిజీగా వుండటం. లేనిపోనిది మీడియా కన్ను పడకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu