Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిజువినేషన్ థెరఫీ ట్రీట్మెంట్‌లో మాస్ మహారాజా రవితేజ.. మరింత స్లిమ్‌గా కనిపించాలట...

వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేసే మాస్ మహారాజు ర‌వితేజ గ‌త కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యాడు. ''కిక్ 2'', ''బెంగాల్ టైగర్'' సినిమాల తర్వాత రవితేజ మార్కెట్ పడిపోయింది. దాంతో రవితేజ భారీ పారితోషికం డిమాండ్ చేస్తు

రిజువినేషన్ థెరఫీ ట్రీట్మెంట్‌లో మాస్ మహారాజా రవితేజ.. మరింత స్లిమ్‌గా కనిపించాలట...
, శనివారం, 17 సెప్టెంబరు 2016 (14:49 IST)
వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేసే మాస్ మహారాజు ర‌వితేజ గ‌త కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యాడు. ''కిక్ 2'', ''బెంగాల్ టైగర్'' సినిమాల తర్వాత రవితేజ మార్కెట్ పడిపోయింది. దాంతో రవితేజ భారీ పారితోషికం డిమాండ్ చేస్తుండటంతో ఆయనతో సినిమాలు చేసేందుకు సాహసం చేయలేకపోతున్నారు నిర్మాతలు. 
 
బెంగాల్ టైగర్ సినిమా విడుదలై 8 నెలలు అవుతున్నా ఇంకా రవితేజ సినిమా ఏది సెట్స్ పైకి వెళ్ళలేదు. అంతేకాదు... ఈ మాస్ హీరో జాడ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీంతో ర‌వితేజ ఏం చేస్తున్నాడు? ఎక్క‌డ ఉన్నాడు అనేదానిపై ఆయ‌న అభిమానుల్లో ఆస‌క్తి నెలకొంది. కొత్త సినిమాలు ఒప్పుకోలేదా లేక కావాల‌నే బ్రేక్ తీసుకున్నాడా అనేది సంచలనంగా మారింది. దీంతో ర‌వితేజా ఏం చేస్తున్నార‌న్న‌దానిపై ఆరాతీస్తే కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన నిజాలు వెలుగు చూశాయి. 
 
ఈ మధ్య కాలంలో ఫిజిక్‌పై బాగా ఫోక‌స్ పెట్టిన ర‌వితేజా ఇప్పుడు రిజువినేష‌న్ థెర‌పీ చేయించుకునేందుకు విదేశాలకు వెళ్తున్నాడ‌ని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అక్క‌డ ఒక రిసార్ట్‌లో ఈ థెర‌పీ ట్రీట్మెంట్ తీసుకుని నలభై పదులు దాటినా కూడా మ‌రింత స్లిమ్‌గా, గ్లామ‌ర్‌గా క‌నిపిస్తాడ‌ట మాస్ మ‌హారాజు. అక్క‌డి నుంచి వ‌చ్చాకే కొత్త సినిమా ప్రాజెక్టుల‌పై ప్ర‌క‌ట‌న చేస్తాడ‌ని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'శ్రీమంతుడు' బాటలో సోను సూద్.. పంజాబ్‌లో ఓ గ్రామం దత్తత