Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నున్నగా గుండు కొట్టించుకున్న నిర్మాత... విలన్ ను చేస్తున్న తేజ

నున్నగా గుండు కొట్టించుకున్న నిర్మాత... విలన్ ను చేస్తున్న తేజ
, గురువారం, 22 జనవరి 2015 (21:21 IST)
తెలుగు సినిమాల్లో విలన్లుగా బాలీవుడ్‌ నుంచి తెచ్చుకోవడం మామూలే. కానీ, కొందరు దర్శకులు ఇక్కడివారినే విలన్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో బోయపాటి శ్రీను జగపతిబాబును విలన్‌గా మార్చి చూపించాడు. దాంతో అందరూ ఆయన్ను విలన్‌గానే అవకాశాలు ఇస్తున్నారు. ఇది దర్శకుడు తెలివి. తాజాగా ఆ కోవలో మరో నటుడు రాబోతున్నాడు.
 
ఆయనే అల్లరి నరేష్‌ అన్న ఆర్యన్‌ రాజేష్‌. అసలు రాజేష్‌కు విలన్‌ వేషాలంటేనే ఇష్టమట. ఇవివిగారు మొదట్లో ఒప్పుకోలేదట. హీరోగా పరిచయం చేశారు. ఈ విషయాన్ని రాజేష్ చెబుతున్నాడు. కాగా, ఈ ఏడాదిలో భారీ చిత్రంలో తాను విలన్‌గా కన్పించనున్నట్లు చెప్పాడు. అయితే ఇంకా ఫైనల్‌ అవ్వలేదనీ, త్వరలో మరిన్ని వివరాలు చెబుతానని వెల్లడించాడు.
 
కాగా, దర్శకుడు తేజ .. ఒక నిర్మాతను విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనే డి.ఎస్‌. రావు. పిల్లా జమిందార్‌ అంటూ నానితో సినిమా తీసిన ఈ నిర్మాత ఈ మధ్య మీసాలు పెంచి, నున్నగా గుండు కొట్టించుకుని కనబడుతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు తేజ అతన్ను విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఫంక్షన్‌లో మాటలు బాగా చెప్పే డి.ఎస్‌.రావు కెమెరా ముందు కూడా బాగానే నటిస్తాడని సన్నిహితులు తెలియజేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu