Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'బాహుబలి' అవంతిక దుస్తులిప్పేసినందుకు ఫీల్ అవుతున్న తాప్సి... మరి ఆమెకో?

'బాహుబలి' అవంతిక దుస్తులిప్పేసినందుకు ఫీల్ అవుతున్న తాప్సి... మరి ఆమెకో?
, గురువారం, 30 జులై 2015 (15:50 IST)
బాహుబలి ది బిగినెంగ్ చిత్రంపై ఇప్పటికే విమర్శల వెల్లువ సాగుతోంది. కథ, కథనం లేకుండా కేవలం సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హైప్ క్రియేట్ చేసి చిత్రాన్ని లాగించేశారంటూ పలువురు నానా రభస చేస్తున్నారు. ఐతే స్టోరీ సంగతి ఎలా ఉన్నా జనం మాత్రం ఎగబడి చూశారు. ఇప్పటికే ఈ చిత్రం 450 కోట్ల రూపాయల మార్కును దాటేసింది. ఇంకా రికార్డులు సృష్టించేందుకు పరుగులు పెడుతోంది.
 
అదలావుంటే... చాలా ఆలస్యంగా సెక్సీ బ్యూటీ తాప్సి ఈ చిత్రంపై స్పందించింది. చిత్రమంటే... చిత్రం మొత్తమ్మీద కాదు... తమన్నా అవంతిక పాత్రలో దుస్తులు విప్పేయడంపైన కామెంట్ చేసింది. దర్శకుడు రాజమౌళిని టార్గెట్ చేస్తూ... హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్స్‌గా మాత్రమే దర్శకులు చూస్తుంటారని చెప్పుకొచ్చింది. అసలు ఇలా చూపించడం ద్వారా హీరోయిన్లను తక్కువ చేసేస్తున్నారంటూ మండిపడింది. ఇలాంటి పరిస్థితులు మారాలంటూ వ్యాఖ్యానించింది. 
 
మరి అంతకుముందు ఎద అందాలను ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేసిన సంగతి ఏంటి తాప్సీ అంటే మాత్రం సమాధానం చెప్పడంలేదట. అంతేమరి... వాళ్లు చేసేటప్పుడు నో కామెంట్... ఎవరైనా చేస్తే మాత్రం కామెంట్సే కామెంట్స్... దటీజ్ ఫిలిమ్ ఇండస్ట్రీ.

Share this Story:

Follow Webdunia telugu