Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమన్నా పెళ్లికి తొందరపడుతోందా...? రెజీనా గ్లామర్ షో... రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్...!! (ఫోటోలు)

బాహుబలి చిత్రంలో పచ్చబొట్టు వేయించుకున్న పాలపిల్ల తమన్నాపై బాలీవుడ్ ఇండస్ట్రీ గుసగుసలు పోతోంది. తమన్నా పెళ్లికి రెడీ అవుతోందనీ, పెళ్లి తర్వాత సినిమాలు చేయదనీ ఏదో రాసేస్తుంది. కాగా తాజాగా తమన్నా నటించి

తమన్నా పెళ్లికి తొందరపడుతోందా...? రెజీనా గ్లామర్ షో... రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్...!! (ఫోటోలు)
, మంగళవారం, 19 ఏప్రియల్ 2016 (14:16 IST)
బాహుబలి చిత్రంలో పచ్చబొట్టు వేయించుకున్న పాలపిల్ల తమన్నాపై బాలీవుడ్ ఇండస్ట్రీ గుసగుసలు పోతోంది. తమన్నా పెళ్లికి రెడీ అవుతోందనీ, పెళ్లి తర్వాత సినిమాలు చేయదనీ ఏదో రాసేస్తుంది. కాగా తాజాగా తమన్నా నటించిన ఊపిరి చిత్రం సూపర్ సక్సెస్ సాధించి ముందుకు వెళుతోంది. ఈ దశలో తమన్నా పెళ్లి చేసేసుకుంటుందంటే నమ్మడం కష్టమే మరి. చూద్దాం... నటి అసిన్‌లా ఝలక్ ఇస్తుందేమో...?

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే గ్లామర్ సూపర్ గా ఆరబోయాల్సి ఉంటుందని చాలామంది హీరోయిన్లు చెప్పేమాట. కానీ రెజీనా మాత్రం ఇదేమీ చెప్పడంలేదు. నేరుగా గ్లామర్ అందాలను ఓరగా చూపించేస్తూ రెచ్చిపోతుంది. పైగా గ్లామర్ ఇండస్ట్రీలో అందంగా కనిపించడం తప్పనిసరి అంటూ వల్లిస్తోంది.
webdunia

మరో బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పైన ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ఓ యువ హీరో ఆమెకు ఇల్లు కొనిచ్చాడని వార్తలు వినిపించాయి. దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ మండిపడుతోంది. ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ఇల్లు కొనుక్కుంటే అది ఎవరో ఓ అబ్బాయి తనకు గిఫ్టుగా కొనిచ్చాడని మీడియాలో వార్తలు రావడం చాలా బాధగా ఉందని అంటోంది. ఐతే తను ఇల్లు కొనుగోలు చేసేటపుడు తన తండ్రి కూడా ఉన్నాడు కాబట్టి సరిపోయిందనీ, లేకపోతే ఏదేదో ఇంకా రాస్తూ ఉండేవారంటూ ఫీలవుతోంది.
webdunia

Share this Story:

Follow Webdunia telugu