Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో సన్నీ లియోన్.. పూరీ జగన్నాథ్ ఛాన్స్!

జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో సన్నీ లియోన్.. పూరీ జగన్నాథ్ ఛాన్స్!
, సోమవారం, 15 సెప్టెంబరు 2014 (17:55 IST)
పోర్న్ స్టార్ సన్నీ లియోన్ టాలీవుడ్ యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని పూరీ జగన్నాథ్ ఇచ్చినట్టు సమాచారం. ఈ పోర్న్ స్టార్ తెలుగులో నటించిన తొలి చిత్రం 'కరెంట్ తీగ'. ఇందులో మంచు మనోజ్ హీరో. ఈ చిత్రం ఇంకా రిలీజ్ కాకుండానే మరిన్ని ఆఫర్లు రావడం గమనార్హం. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో సన్నీతో ఓ హాట్ ఐటెం సాంగ్ చేయించనున్నట్టు వినికిడి. 
 
ఐటెం సాంగులకు పెట్టింది పేరైన పూరీకి సన్నీతో ఇప్పటికే మంచి పరిచయముంది. దానికి తోడు 'కరెంట్ తీగ'లో ఆమె కరెంట్ తీగలో నటించిన ఐటెం సాంగును ప్రత్యేకంగా ప్రొజక్షన్ వేయించుకుని చూశాడట. ఆమె బాడీ లాంగ్వేజ్ తెలుగు సినిమాలకు బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చిన ఈ దర్శకుడు ఎన్టీఆర్‌తో తాను తీస్తున్న తాజా చిత్రంలో ఆమెకు ఛాన్స్ ఇస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu