Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విడాకులు... సినిమాలు... అమలాపాల్ తదుపరి ప్లానేంటో తెలుసా?

కోలీవుడ్ దర్శకుడు ఎ.ఎల్. విజయ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత సినీ నటి అమలా పాల్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే భవిష్యత్తులో చెన్నైలో పెద్ద హోటల్ ప్రారంభించాలని అమ్మడు భావిస్తోంది. పెద్ద హోటల్

విడాకులు... సినిమాలు... అమలాపాల్ తదుపరి ప్లానేంటో తెలుసా?
, మంగళవారం, 7 మార్చి 2017 (17:36 IST)
కోలీవుడ్ దర్శకుడు ఎ.ఎల్. విజయ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత సినీ నటి అమలా పాల్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే భవిష్యత్తులో చెన్నైలో పెద్ద హోటల్ ప్రారంభించాలని అమ్మడు భావిస్తోంది. పెద్ద హోటల్ ప్రారంభించి అందులో యోగా, ధ్యానానికి సంబంధించిన తరగతులు ప్రారంభించాలని అమలా పాల్ భావిస్తున్నట్లు ఆమె సన్నిహితుల సమాచారం. 
 
ప్రస్తుతం కన్నడంలో ఓ సినిమా చేస్తున్న అమలా పాల్.. ఆ సినిమా హిట్ కొట్టేయడంతో మలయాళం, తమిళ సినిమాల్లో నటిస్తోంది. విజయ్ నుంచి విడిపోయినా.. ఇప్పటికీ ఇంటర్వ్యూల్లో అమలాపాల్ తనకు విజయ్ అంటేనే ఇష్టమని చెప్పుకొస్తుంది. భవిష్యత్తులో అమలాపాల్‌ తప్పకుండా హోటల్ ప్రారంభించాలనే యోచనలో ఉందని సమాచారం. అయితే భవిష్యత్తులో విజయ్‌తో అమలా కలిసి జీవిస్తుందా లేదా అనేది సస్పెన్స్. 
 
విజయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని, దీంతో అమలా పాల్ కంటతడి పెట్టుకుందని ఇటీవల కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారానికి విజయ్ ఫుల్ స్టాప్ పెట్టారు. తాను రెండో వివాహం చేసుకోలేదని.. తన కెరీర్‌లో ఎదుగుదలకు సహకరించిన మీడియా ఇలాంటి వార్తలు సృష్టించవద్దని చెప్పుకొచ్చారు. 
 
ఇదిలా ఉంటే.. సుచిత్ర లీకులు కోలీవుడ్‌లో హీటు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీకుల్లో ధనుష్- అమలా పాల్ ఫోటోలు లీకయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ధనుష్ అమలా పాల్ విడాకులకు కారణమైనాడని సినీ జనం అనుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది.. భర్త కార్తీక్‌తో విడాకులు తీసుకుంటున్నా: సుచిత్ర