Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బాహుబలి' బిగినింగ్‌పై విమర్శలు... పార్టు 2 కోసం రాజమౌళి తిప్పలు

'బాహుబలి' బిగినింగ్‌పై విమర్శలు... పార్టు 2 కోసం రాజమౌళి తిప్పలు
, మంగళవారం, 28 జులై 2015 (20:10 IST)
కథలో ముగింపు లేకుండా 'బాహుబలి'ని తీశాడు రాజమౌళి. ఇప్పుడు పార్టు2లో ఎటువంటి ట్విస్టులతో ముగింపు ఇవ్వాలా? అని ఆలోచనలో పడ్డాడు ఈ దర్శకుడు. బాహుబలి చూసిన ప్రేక్షకులందరికీ పార్టు2లో రాజమౌళి ఏం చూపించబోతున్నారో ఎవరి క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో కూడా ఒక అవగాహన వచ్చినట్టే. ఎలా ఉంటుందో కూడా ప్రచారం జరుగుతోంది. 
 
కానీ అందరూ అనుకున్నట్టే తీస్తే తన సినిమా ఎలా అవుతుందని అనుకుంటున్నాడు రాజమౌళి. ఎవరి ఊహకూ అందని రీతిలో సినిమా తెరకెక్కించాలని భావిస్తున్నాడట. మొదట్లో అందరూ ఊహించినట్టే తీద్దామనుకున్నా ఇప్పుడు తన ఆలోచనను మార్చుకున్నాడట. పార్టు2లో అనేక ట్విస్టులతో కథ నడిపించే విధంగా  స్క్రిప్ట్‌ తయారుచేసే పనిలో రాజమౌళి ఉన్నట్లు సమాచారం. పార్టు 2 ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ చిత్రం షూటింగ్‌ అక్టోబర్‌ నుంచి ప్రారంభం కానుంది.

Share this Story:

Follow Webdunia telugu