Disco Shanti and Meghansh srihari
రియల్ స్టార్ శ్రీహరిగా పేరు పొందాడు. తన సినిమాలలో ప్రత్యేక బిరుదును కూడా సంపాదించుకున్నాడు. ఆయన కెరీర్ పీక్ లో వుండగానే తన కొడుకులను సినీరంగంలో వారసులుగా ప్రకటించారు. కానీ అది ఆయన బతికున్నంతకాలం సాధ్యపడలేదు. శ్రీహరి మరణం తర్వాత ఆయన భార్య శాంతి తన కుమారుల బాధ్యతను తీసుకున్నారు. అప్పటివరకు వారి కుటుంబానికి అండగా వున్న వారంతా దూరమయ్యారు.
మొక్కవోని పట్టుదలతో శాంతి తన కుమారులను సినీరంగంలో ప్రవేశింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమె రెండో కుమారుడు మేఘాంశ్ ఐదు ఏళ్ళ నాడు రాజ్ దూత్ అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా ఉపయోగపడలేదు. కెరీర్ పరంగా తన పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు మేఘాంశ్. ఇప్పుడు సరికొత్త సినిమాతో ముందుకు రాబోతున్నాడు. దీనికి సంబంధించిన పొటో షూట్ మొదలైంది. అందుకు సంబంధించిన స్టిల్స్ ను ఇన్ స్ట్రాలో విడుదల చేశారు.
స్టయిలిష్ హకిమ్సాలి ఆద్వర్యంలో ఫొటో షూట్ జరుగుతోంది. ఢిస్కో శాంతికి చెందిన నిర్మాతలు ఈ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించే ఆలోచనలో వున్నారు. రియల్ స్టార్ శ్రీహరి కెరీర్ లో ఒడిదుడుగలను ద్రుష్టిలో వుంచుకుని మేఘాంశ్ చిత్రం వుంటుందనీ సమాచారం. శ్రీహరి, డిస్కో శాంతి పెద్ద కుమారుడు శశాంక్ ఈ చిత్రానికి పర్యవేక్షకునిగా వుంటున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.