Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రద్దాదాస్‌ పైట్‌... పడగొట్టిన బాలీవుడ్ నటి

శ్రద్దాదాస్‌ పైట్‌... పడగొట్టిన బాలీవుడ్ నటి
, గురువారం, 20 నవంబరు 2014 (16:26 IST)
నటి శ్రద్దాదాస్‌ అంటే తెలుగువారికి తెలిసిందే. మంచి ఎత్తు గల ఈ భామ... కరాటేలో బ్లాక్‌ బెల్ట్ కూడా. తెలుగులో పలు చిత్రాల్లో నటించినా.. ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆమధ్య బాలీవుడ్‌లో నటిస్తున్నట్లు ప్రకటించింది. దానికి తగినట్లు జిద్‌ అనే సినిమాలో నటించింది. అందులో ఓ పాటలో డాన్స్‌ చేస్తూ కళ్లతోనే కైపెక్కిస్తుంది. ఆమెతోపాటు మలాల అనే మరో నటి కూడా నటించింది. 
 
ఇద్దరూ పాటలో డాన్స్‌ చేస్తూ ఓ సందర్భంలో చిలిపిగా కొట్టుకోవాలట. కానీ శ్రద్ధాదాస్‌కు గట్టిగా దెబ్బతగిలందట. దాంతో అమ్మో.. అంటూ షాట్‌లో‌నే పడిపోయిందన సమాచారం. ఏదైనా సీన్స్‌ చేసేటప్పుడు ఆవేశంగా కొట్టడం మామూలే. అయితే ఇద్దరి మధ్య ఏదైనా తేడా వస్తేనే ఇలా జరుగుతుందని శ్రద్ధాపై కక్షతోనే కొట్టిందని యూనిట్‌ చెబుతోంది. దీంతో శ్రద్దా పరిస్థితిపై ఫోన్లపై ఫోన్లు చేస్తున్నారట.

Share this Story:

Follow Webdunia telugu