Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ఐ' సినిమా తెలుగులో వర్కవుట్‌ అవుతుందా...? ఎక్కడో తంతుదన్నయ్యా....

'ఐ' సినిమా తెలుగులో వర్కవుట్‌ అవుతుందా...? ఎక్కడో తంతుదన్నయ్యా....
, సోమవారం, 22 సెప్టెంబరు 2014 (14:40 IST)
విక్రమ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'ఐ'. దీన్ని ఆస్కార్‌ రవిచంద్రన్‌ నిర్మించాడు. 180 కోట్లతో తీశామని నిర్మాత చెబుతున్నారు. ఈ చిత్రం దీపావళికి విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కాగా, తెలుగు హక్కుల్ని ఆర్‌.బి. చౌదరి 30 కోట్లతో చేజిక్కించుకున్నారని వార్త విన్పిస్తుంది. 
 
పెద్ద మొత్తంలో తీసుకున్నా... ఆర్‌.బి. చౌదరి విషయంలో ఆస్కార్‌కు ఓ సెంటిమెంట్‌ వుంది. ఇటీవలే ఆయన కూడా వెల్లడించారు. తమిళంలో ఆయన సినిమాలు డిస్ట్రిబ్యూషన్‌ చేసే సమయంలో కొన్ని సినిమాలు చివరివరకు వచ్చి ఆఖరి నిముషంలో ఆర్‌బి చౌదరికి వెళ్ళేవట. అవి ఫెయిల్‌ అయ్యేవట. 
 
దేవుడు నాకు ఇలా మంచి పనులు చేస్తుంటాడని చెప్పాడు. ట్విస్ట్‌ ఏమంటే.. ఇప్పుడు ఆస్కార్‌ చేసిన ఐ సినిమాను ఆర్‌బి చౌదరి చేయడం. ఇదే గనుక నిజమైతే... తమిళంలో హిట్టవ్వాలి. తెలుగులో చౌదరి తీసుకున్నాడు కాబట్టి.. ఏమవుతుందో చూడాలి. చాలా ఆసక్తికరంగా ఈ విషయమై చర్చ జరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu