Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో సంపూ హీరోగా... అబ్బో ఏం రేంజ్...?

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో సంపూ హీరోగా... అబ్బో ఏం రేంజ్...?
, మంగళవారం, 18 నవంబరు 2014 (14:51 IST)
ఫేస్‌బుక్‌ ద్వారా నటుడిగా మారి పబ్లిసిటీని పూర్తిగా వుపయోగించుకుని నటుడైన సంపూర్ణష్‌ బాబుకు ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు. 'హృదయ కాలేయం' చిత్రంతో పేరు తెచ్చుకున్నా.. రెండవ సినిమా... కొత్తజంటలో... ఆయన ట్రాక్‌ హైలైట్‌ అవుతుందనీ అల్లు శిరీష్‌పై పడుతుందని భావించి... మొత్తంగా సంపూ ట్రాక్‌ను కట్‌ చేశారంట. 
 
ఆ తర్వాత మంచు మనోజ్‌... కరెంట్‌తీగలో సన్నిలియోన్‌ భర్తగా చిన్న ట్విస్ట్‌ ఇచ్చే పాత్రను ఎంపిక చేశారు. సినిమాలో మనోజ్‌ కంటే.. సంపూ కన్పించగానే.. ఆడియన్స్‌ కేరింతలు చేయడం విశేషం. ఇదే ట్రెండ్‌.. బయట ఫంక్షన్లలోనూ కన్పించినా జరుగుతుంది. ఇదంతా సంపూ అదృష్టం. ఇప్పుడు అదే నిజమవుతుంది. 
 
రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో సంపూ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసం ఆయన స్టయిల్‌ను కొత్తగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంపూతో.. సింగం 123, కొబ్బరిమట్ట చిత్రాలు రన్నింగ్‌లో వున్నాయి. వర్మ సినిమా ఏ రేంజ్‌లో వుంటుందో.. అందులో ఎవరెవరిపై ఎన్ని సెటైర్లు వుంటాయో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu