Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమంత కొత్త అవతారం.. నిర్మాతగా సినిమా తీస్తుందట!

సమంత కొత్త అవతారం.. నిర్మాతగా సినిమా తీస్తుందట!
, బుధవారం, 17 సెప్టెంబరు 2014 (12:49 IST)
నిజమా అనుకుంటున్నారా..? నిజమేనండి. సమంత హీరోయిన్‌గా కోట్లు సంపాదించేసింది. ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గకముందే నిర్మాతగా కొత్త అవతారం ఎత్తేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సినీ ఇండస్ట్రీ తెగ తెలివైన హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటున్న సమంత.. ఇన్నాళ్లూ టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ కథానాయికగా రాణించింది. 
 
ప్రస్తుతం తమిళ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో త్వరలో ఆమె నిర్మాతగా కూడా మారనుందంటూ కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. ఇటీవల కోలీవుడ్‌కు చెందిన ఓ యువ దర్శకుడు సమంతాను కలసి ఓ కథ చెప్పాడనీ, అది ఆమెను బాగా ఆకట్టుకుందనీ అంటున్నారు.
 
దానికి బడ్జెట్టు వేయమని చెప్పి, సమంతా ఆ చిత్రాన్ని తానే నిర్మిస్తానంటూ ముందుకు వచ్చిందట. అయితే, అందులో ఆమె నటించదనీ, అది చిన్న బడ్జెట్టు సినిమా అనీ కూడా అంటున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
కథానాయికగా మంచి పొజిషన్‌లో వున్న ఈ చెన్నయ్ భామకు అసలు చిత్ర నిర్మాణం ఎందుకంటూ మరోపక్క కొంతమంది అప్పుడే విమర్శలు మొదలెట్టారు. మరి ఈ విమర్శలకు సమంత ఎలాంటి  సమాధానమిస్తుందో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu