Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దలైలామా వద్దకు ప్రియురాలు లూలియాతో సల్మాన్.. ఎందుకెళ్లినట్టు..?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ''ట్యూబ్ లైట్''. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ లడక్ ప్రాంతంలో శరవేగంగా జరుగుతుంది. గతంలో కబీర్ ఖాన్ - సల్మ

దలైలామా వద్దకు ప్రియురాలు లూలియాతో సల్మాన్.. ఎందుకెళ్లినట్టు..?
, శనివారం, 13 ఆగస్టు 2016 (17:45 IST)
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ''ట్యూబ్ లైట్''. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ లడక్ ప్రాంతంలో శరవేగంగా జరుగుతుంది. గతంలో కబీర్ ఖాన్ - సల్మాన్ కాంబినేషన్‌లో విడుదలైన "ఏక్ థా టైగర్'', ''భజరంగీ భాయ్ జాన్'' చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
ఈ చిత్రం షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ముగియడంతో తిరిగి ముంబయి చేరడానికి ముందు సల్మాన్, తన ప్రియురాలు లులియా వాంతూరుతో కలిసి బౌద్ధమత గురువు దలైలామాను కలిశాడు. దలైలామాకు ఒక వైపున ఉన్న సోఫాలో సల్మాన్, లులియాలు కూర్చోగా, మరో వైపు దలైలామా సహాయకులు ఉన్నారు. వీరందరూ కలిసి ముచ్చటిస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లుకొడుతోంది. అయితే, దలైలామాతో సల్మాన్ ఏం ముచ్చటించారనే విషయం సస్పెన్స్‌గానే ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రిన్స్ కోసం.. సాయిధరమ్ తేజ్, నితిన్‌కు హ్యాండిచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎలా..?