Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'రుద్రమదేవి'కి గోన గన్నారెడ్డి పైకం... ఏంటి సంగతి?

'రుద్రమదేవి'కి గోన గన్నారెడ్డి పైకం... ఏంటి సంగతి?
, గురువారం, 24 జులై 2014 (15:48 IST)
3డి వెర్షన్‌లో తెరకెక్కుతున్న 'రుద్రమదేవి' సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. అయితే అల్లు అరవింద్‌ కాస్త చేయూత ఇవ్వడంతో కష్టాలు తీరి సినిమా సెట్‌పైకి వెళ్ళింది. గతంలో కొంత భాగాన్ని షూట్‌ చేశాక... ఆ చిత్రం ఆగిపోయింది. గుణశేఖర్‌.. బయట సినిమాలకు భారీగా ఖర్చుపెట్టించే వాడు. స్వంత సినిమాకు కూడా అలాగే చేయడంతో బడ్జెట్‌ భారీ అయింది. 
 
దాంతో ఆ చిత్రంలో ఓ దోపిడీదారు అంటే.. గోన గంగారెడ్డి పాత్రను అల్లు అర్జున్‌ను ఎంపిక చేశాడు. ఈ కథను అద్భుతంగా గుణశేఖర్‌ నెరేట్‌ చేశాడని తెలిసింది. అసలు గోన గన్నారెడ్డి చాలా ఎత్తుగా ఉంటాడు. మరి అర్జున్‌ ఏమాత్రం సరిపోడని కథ తెలిసినవారు చెబుతున్నారు. కానీ.. అసలు ఆయన కథ గురించి ప్రజలకు పెద్దగా తెలియకపోవడంతో... ఇలాగే ఉంటాడనే భ్రమ కల్పిస్తున్నాప్రతిష్టాత్మకంగా డు గుణశేఖర్‌. 
 
ఈ పాత్రను ఇచ్చినందుకు అర్జున్‌ కొంత బడ్జెట్‌ పెట్టాల్సి వచ్చిందని ఫిలింనగర్‌ కథనం. కాగా, ఈ చిత్రం కొన్ని ఏరియాలను గీతా ఆర్ట్స్‌ తీసుకుందని... సమాచారం.. ఇలా బడ్జెట్‌ చిత్రాలు తీసి... గుణశేఖర్‌ ఎటువంటి సినిమా తీస్తాడో చూడాలి. కాగా, రుద్రమదేవి తండ్రిగా కృష్ణంరాజు నటిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu