Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరంజీవితో ఎలాంటిదైనా చేయడానికి నేను రెడీ... రెజీనా

చిరంజీవితో ఎలాంటిదైనా చేయడానికి నేను రెడీ... రెజీనా
, మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (12:53 IST)
తాను అందరి చిత్రాలు చేస్తానని ఏ ఒక్క హీరోకో లేదంటే ప్రత్యేకించి కొన్ని బ్యానర్లకే పరిమితం కాదని రెజీనా తెలియజేస్తుంది. ఆమె అల్లు అర్జున్‌, శిరీష్‌లతో పాటు గీతా ఆర్ట్స్‌ బేనర్‌లో పలు చిత్రాలను చేసింది. వారి చిత్రాలనే చేస్తుందన్న బ్రాండ్‌ ఇండస్ట్రీలో నెలకొంది. దీనిపై ఆమె స్పందిస్తూ... అగ్రిమెంట్‌ రాశాననీ, అందుకే ఆ బేనర్‌లో చేస్తున్నానని వచ్చే వార్తలో నిజంలేదు. నాకు మొదట అవకాశం ఇచ్చింది గీతా ఆర్ట్స్‌ కాబట్టి వారి చిత్రాలంటే గౌరవం అంది.
 
కొన్ని చిత్రాల్లో గ్లామర్‌ పాత్రలు, ఎక్స్‌పోజింగ్‌ చేస్తున్నారనేదాని పైన స్పందిస్తూ... పాత్ర మేరకే ఏదైనా వుంటుంది. తమిళంలో రెండు చిత్రాల్లో చేశాననీ, అవి మంచి గుర్తింపు తెస్తాయని తెలియజేస్తుంది. నాకు గుర్తింపునిచ్చిన తెలుగు పరిశ్రమను మర్చిపోలేనని చెబుతోంది. చిరు చిత్రంలో అవకాశం వస్తే చేస్తారా! అంటే... అలాంటి అగ్రహీరో చిత్రంలో చిన్న పాత్ర వచ్చినా అదృష్టంగా భావిస్తానని అంది... మరి అమ్మడిని తీసుకోవాలి కదా...

Share this Story:

Follow Webdunia telugu