Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అల్లు అర్జున్ సరసన ఛాన్స్ కొట్టేసిన రెజీనా

అల్లు అర్జున్ సరసన ఛాన్స్ కొట్టేసిన రెజీనా
, మంగళవారం, 19 ఆగస్టు 2014 (17:27 IST)
ముందుగా అనుకున్నట్లే నటి రెజినా పెద్ద చిత్రాల్లో ఛాన్స్‌ కొట్టేసింది. అంతకుముందు ఒకటిఅరా చిత్రాల్లో నటించినా.. మారుతీ 'కొత్తజంట'లో నటించింది. అల్లు శిరీష్‌ హీరోగా చేసిన చిత్రంలో ఈమె పాత్రకు పేరు వచ్చింది. అప్పట్లోనే శిరీష్‌ కంటే రెజీనాకు అల్లు కాంపౌండ్‌ మనుషులు తెగ పబ్లిసిటీ ఇచ్చేశారు. అప్పట్లోనే మరో సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తానని అంది. 
 
అయితే ఈ చిత్రం అల్లు అర్జున్‌తోనే అనేది ఇప్పుడు రూఢీ అయింది. ఇప్పటికే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది పూర్తి కమర్షియల్‌తో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా. శ్రుతిహాసన్‌ ప్రధాన హీరోయిన్‌. మరో హీరోయిన్‌గా రెజీనాను ఎంపిక చేసినట్లు తెలిసింది. త్వరలో దీనికి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu