టాలీవుడ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి డేట్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. 2026 ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జంటకు 2025 అక్టోబర్ 3నే హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరిగింది.
అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుకను నిర్వహించారు. ఉదయ్‌పూర్‌లో జరగబోయే పెళ్లి కూడా పూర్తిగా ప్రైవేట్ వ్యవహారంగా ఉండనుందని, ఆ తర్వాత హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం. అయితే, విజయ్ కానీ, రష్మిక కానీ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఇక వీరి సినిమాల సంగతికి వస్తే.. విజయ్ దేవరకొండ చివరగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన కింగ్‌డమ్‌లో కనిపించగా, త్వరలో రౌడీ జనార్దనతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రష్మిక మందన్న ఇటీవల ఆయుష్మాన్ ఖురానాతో తమ్మ, తెలుగులో ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రాల్లో నటించారు.