Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్రిషది బెస్ట్ బాడీ... ఆమె నాతో గొడవపడి వెళ్లిపోయింది... రానా

త్రిషది బెస్ట్ బాడీ... ఆమె నాతో గొడవపడి వెళ్లిపోయింది... రానా
, బుధవారం, 30 జులై 2014 (19:30 IST)
రామానాయుడు ఉరఫ్‌ రానా... సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత వారసుడు.. ఆరు అడుగుల కన్నా ఎత్తు.. ఒడ్డూపొడుగూ ఉండే పర్సనాలిటీ చాలు. ఏ అమ్మాయైనా పడిపోవడానికి... పైగా సినిమా రంగంలో టెక్నికల్‌ నాలెడ్జ్‌ కూడా వుంది. అయినా హీరోగా వారసుడిగా నిలబెట్టాలని సురేష్‌ బాబు చేసిన ప్రయత్నంతో హీరో అయిపోయాడు. అంతే అప్పటి నుంచి చాలామంది ఆయనకు ఫ్యాన్స్‌గా మారి లవర్స్‌గా మారారు.
 
తనకు ఆల్రెడీ ఓ గర్ల్‌ఫ్రెండ్‌ వుండేదని రానా ఓసారి చెప్పాడు. ఆమెకు ఇండస్ట్రీ గురించి ఏమీ తెలీదు. షూటింగ్‌ వుండగానే చాలాసార్లు ఫోన్లు చేసేది. నేను కొన్నిసార్లు రెస్పాన్స్‌ అయ్యేవాడ్ని కాదు. ఓసారి హిందీ సినిమా షూటింగ్‌. రామ్‌గోపాల్‌వర్మ దర్శకుడు. ఆయనతో చర్చిస్తూ కారవాన్‌లో కూర్చొని బయటకు వచ్చాను. అక్కడకు షడెన్‌గా వచ్చి.. చిత్రంగా చూసి.. ఇందుకేనా నాకు రెస్పాన్స్‌ ఇవ్వలేదని తగవు వేసుకుంది. 
 
ఏమి చెప్పినా వినలేదు. దాంతో ఆమెతో బ్రేకప్‌ అయిందని.. రానా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే త్రిష గురించి మాత్రం చాలా పాజిటివ్‌గా స్పందించారు. ఆమెది బెస్ట్‌ బాడీ అంటూ కితాబిచ్చాడు. మరి ఆ బాడీ ఎలా చూశాడో అడక్కండి. సెక్సీ అండే క్లాసీ హీరోయిన్‌గా నయనతారను పోల్చాడు. 
 
ఇలా ఒక్కో హీరోయిన్‌ ఒక్కోరంగా పోల్చిన రానా.. త్రిషతో మాత్రం 12 ఏళ్ల నుంచి పరిచయం వుంది. జీవితంలో చాలా మంది మనస్సుకు దగ్గవుతారు. అలాంటి ఆమె త్రిష అంటూ చెప్పేశాడు. గతంలో త్రిషపై పలు వార్తలు వచ్చాయి. అవన్నీ పుకార్లే. ఓన్లీ బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటూ చెప్పాడు. మరి శ్రియ గురించి ఏమీ చెప్పలేదంటబ్బా అనే ప్రశ్నలు వేయకండి.

Share this Story:

Follow Webdunia telugu