Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'గబ్బర్ సింగ్ 2' ఆఫర్ పై రకుల్ షాకింగ్ కామెంట్...

'గబ్బర్ సింగ్ 2' ఆఫర్ పై రకుల్ షాకింగ్ కామెంట్...
, మంగళవారం, 21 అక్టోబరు 2014 (18:36 IST)
పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2’ చిత్రంలో తనకు ఛాన్స్ దక్కిందంటూ మీడియాలో వార్తలు రావడంపై సెక్సీ సుందరి రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్లు చేసింది. తనకు ఎదురయిన మీడియావారితో.... తాను ‘గబ్బర్ సింగ్ 2’లో హీరోయిన్‌గా ఎంపిక అయిన విషయం తాను కూడా మీడియా వార్తలలో చూస్తున్నానని, నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని రకుల్ చెప్పుకొచ్చింది. 
 
తను గబ్బర్ సింగ్ 2లో నటిస్తున్నట్లు మీడియా సృష్టించిన వార్త నిజం కావాలని తను దేవుడిని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. మరి నిజంగా గబ్బర్ సింగ్ 2లో రకుల్ ప్రీత్ సింగ్ కు అవకాశం రానట్లయితే ఈ వార్త పుట్టించింది ఎవరబ్బా అని సినీజనం మళ్లీ ఆలోచనలో పడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu