Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిహారిక తర్వాత శివానితో నాగశౌర్య రొమాన్స్.. హిట్టేనా..? లేకుంటే..?

రాజశేఖర్-జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని కూడా ఇక తెరపై కనిపించేందుకు సై అంటోంది. కొంతకాలంగా మంచి ఛాన్స్ వస్తే శివానిని హీరోయిన్‌గా చేద్దామని ఎదురుచూస్తున్న రాజశేఖర్‌కు మంచి ఛాన్స్ వచ్చింది. ఇటీవలే

నిహారిక తర్వాత శివానితో నాగశౌర్య రొమాన్స్.. హిట్టేనా..? లేకుంటే..?
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (13:06 IST)
రాజశేఖర్-జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని కూడా ఇక తెరపై కనిపించేందుకు సై అంటోంది. కొంతకాలంగా మంచి ఛాన్స్ వస్తే శివానిని హీరోయిన్‌గా చేద్దామని ఎదురుచూస్తున్న రాజశేఖర్‌కు మంచి ఛాన్స్ వచ్చింది. ఇటీవలే జ్యో అచ్యుతానంద చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన నాగ శౌర్య హీరోగా సాయి కొర్రపాటి నిర్మాణంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్రం ద్వారా శివానిని కథానాయికగా పరిచయం చేయడానికి జీవిత-రాజశేఖర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 
 
ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు పరిచయం కావడంతో పాటు.. శివానిని కూడా హీరోయిన్‌గా తెరంగేట్రం చేయించాలని రాజశేఖర్ దంపతులు పక్కా ప్లాన్ చేస్తున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి శివాని హీరోయిన్‌గా ఏ రేంజ్‌లో రాణిస్తుందో వేచి చూడాలి. 
 
కాగా మెగా హీరోయిన్ నిహారికకు తర్వాత మరో స్టార్ కుమార్తెతో నాగశౌర్య రొమాన్స్ చేయనున్నాడు. ఒక మనసుతో నిహారికకు అంత గుర్తింపు సాధించిపెట్టకపోయినా.. నాగశౌర్యకు మంచి మార్కులు వచ్చాయి. ఆపై జ్యో అచ్యుతానందతో నాగశౌర్య హిట్ కొట్టేశాడు. కానీ నిహారిక పరిస్థితే ఏంటనేది తెలియట్లేదు. అందం ప్లస్ అభినయం ఉన్నప్పటికీ రెండో సినిమాలో నటించేందుకు నిహారిక మల్లగుల్లాలు పడుతోంది. చిరంజీవి 150వ సినిమాలో గెస్ట్ రోల్ చేసేశాక.. ఆపై రెండో సినిమాను ప్లాన్ చేద్దామని నిహారిక భావిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో నాగశౌర్య మరో స్టార్ రాజశేఖర్ కూతురితో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇదే గనుక జరిగితే మెగా వారసురాలికి తర్వాత రాజశేఖర్ వారసులిగా శివాని తెరంగేట్రం చేసినట్లవుతుంది. ఇక నిహారికతో జోడీ కట్టిన నాగశౌర్య శివానితోనూ నటించడం కలిసొస్తుందో లేదోనని సినీ పండితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#nirmalaconvent కాదు... #Roshan, కమాన్ #Roshan... కమాన్, శ్రీకాంత్ బిడ్డ ఇరగదీశాడు...