Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజమౌళి, క్రిష్ మధ్య చిచ్చుపెట్టిన శాతకర్ణి: దీంట్లో జెలసీ పాత్ర ఎంత?

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా వాణిజ్యపరంగా విజయవంతం చేయడంలో దర్శకుడు క్రిష్ చూపెట్టిన ప్రతిభను వేనోళ్ల కొనియాడిన రాజమౌళి తన పేరిట అచ్చయిన ఒక ఉత్తరం విషయంలో మొత్తం శాతకర్ణి చిత్ర బృందం విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసిన ఘటన దిగ్భ్రాంతి కలిగిస్తోంది. తన పేరి

రాజమౌళి, క్రిష్ మధ్య చిచ్చుపెట్టిన శాతకర్ణి: దీంట్లో జెలసీ పాత్ర ఎంత?
హైదరాబాద్ , శనివారం, 28 జనవరి 2017 (03:23 IST)
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా వాణిజ్యపరంగా విజయవంతం చేయడంలో దర్శకుడు క్రిష్ చూపెట్టిన ప్రతిభను వేనోళ్ల కొనియాడిన రాజమౌళి తన పేరిట అచ్చయిన ఒక ఉత్తరం విషయంలో మొత్తం శాతకర్ణి చిత్ర బృందం విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసిన ఘటన దిగ్భ్రాంతి కలిగిస్తోంది. తన పేరిట శాతకర్ణి టీమ్ రాసిన ఉత్తరం సందర్భానికి తగినట్లుగా లేదని రాజమౌళి ఆరోపిస్తూ క్రిష్‌ను ఈ విషయమై నిగ్గదీశాడు. కానీ ఇంకా ఆ వైపునుంచి సమాధానం రాకపోవడం ఈ ఇద్దరు అగ్ర  దర్శకుల సంబంధాలనే దెబ్బతీయనుందా అని అనుమానాలు ప్రబలుతున్నాయి. 
 
జరిగిన పరిణామాలను రాజమౌళి మాటల్లోనే విందాం. 
 
"క్రిష్‌తో ఇంటర్య్యూ చేయాలని అడిగినప్పుడు నేను సంతోషంగా ఒప్పుకున్నాను. ఎందుకంటే నిజంగానే ఆ సినిమాను నేను అభినందించాను. ఆ ఇంటర్వ్యూ విశేషాలను పత్రికలో వేసుకుంటామని సదరు పత్రిక వారు అడిగినప్పుడు నేను అంగీకరించాను. కాని ఆ ఉత్తరం నేను రాసినట్లుగా ఆ పత్రికలో రావటం చూసి ఆశ్చర్యపోయాను. ఆ ఉత్తరం లోని విషయం ఇంటర్ప్యూనుంచి తీసుకున్నదే కాని దాంట్లో పొందుపర్చిన పదాలు మరీ నాటకీయంగా ఉన్నాయనిపించింది. అయితే ఆ ఉత్తరం సందర్భ సహితంగా లేనప్పటికీ, శాతకర్ణి సినిమా పట్ల, క్రిష్ పట్ల, అతడి చిత్ర బృందం పట్ల నా అభిప్రాయం మారలేదు. శాతకర్ణి చిత్రం ఇంకా వసూళ్లు చేయాలని, మరిన్ని చారిత్రాత్మక చిత్రాలను తీయాలని ఆశిస్తున్నాను. కానీ ఆ ఉత్తరం లోని అక్షరాలు మాత్రం నావి కావు" అంటూ రాజమౌళి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
 
తానెన్నడూ రాయని ఉత్తరానికి సంబంధించి క్రిష్, అతడి టీమ్ నుంచి తానింతవరకు స్పందనను అందుకోలేదని రాజమౌళి చెప్పారు. ఈ విషయమైన క్రిష్‌ని అడిగానని, తన టీమ్ అత్యుత్సాహమే తప్ప మరేం లేదని క్రిష్ చెప్పాడని, కానీ ఈ విషయమై వివరణ కోసం నేను వేచి చూస్తున్నాను కాని ఇంతవరకు వారి నుంచి రాలేదు అన్నారు రాజమౌళి.
 
అయితే  ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలను ఉత్తరంగా రాసి మీకు పంపిస్తామని మీరు ఒకే చేసిన తర్వాతే ప్రచురిస్తామని గౌతమీపుత్ర శాతకర్ణి  సంభాషణల రచయిత బుర్రా సాయిమాధవ్ చెప్పగా రాజమౌళి ఆ లాంఛనాలు ఏమీ వద్దు ప్రొసీడ్ అని రాజమౌళి అన్న తర్వాత వారు తన మాటలను తాను చెప్పినట్లుగా
 
ఉత్తరం రూపంలో రాసి పత్రికలో ప్రచురించారని తెలుస్తోంది. అయితే భావోద్వేగానికి, నాటకీయతకు ప్రాధాన్యమిచ్చిన ఆ ఉత్తరం తన అసలు ఉద్దేశాన్ని ప్రకటించలేదని అసంతృప్తి చెందిన రాజమౌళి మీరు ఈ ఉత్తరం విషయంలో వివరణ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టడంతో క్రిష్‌కి ఏం చేయాలో అర్థం కావటంలేదని సమాచారం. 
 
మరోపైవున 79 రోజుల్లో శాతకర్ణి వంటి చారిత్రక సినిమాను అంత గ్రాండ్‌గా తీసి అద్భుత విజయం సాధించడం రాజమౌళిలో జెలసీని పెంచినట్లుందని కూడా కొందరు అంటున్నారు. బాహుబలి సినిమాను నాలుగేళ్లుగా తీస్తూ నిర్మాతలకు వందల కోట్ల రూపాయలు ఖర్చునిచ్చాడన్న అపప్రథ శాతకర్ణి సినిమా తర్వాత రాజమౌళి మీద పడటంతో తాను ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని కూడా సమాచారం. 
 
అటు క్రిష్, ఇటు రాజమౌళి తమ మనసుల్లో ఏముందని స్వయంగా చెప్పేంతవరకు వీరి మధ్య ఏం జరుగుతోందన్న విషయంలో స్పష్టత రాదు. ఇద్దరు మేటి దర్శకుల మధ్య పొరపాటున ఏవయినా పొరపొచ్చాలు ఏర్పడి ఉన్నా అవి త్వరగా వైదొలిగిపోతాయని, వైదొలగాలని ఆశిద్దాం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగ్నంగా నటించినా నా భర్త నన్నేమీ అనడు... ఆ హీరో తన గదికి రమ్మన్నాడు... రాధికా ఆప్టే