Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజ్ తరుణ్ చాలా కాస్ట్‌లీ గురూ... ఇంతలోనే అంత పెరిగిందా... అయ్యా నమస్కారం...

రాజ్ తరుణ్ చాలా కాస్ట్‌లీ గురూ... ఇంతలోనే అంత పెరిగిందా... అయ్యా నమస్కారం...
, మంగళవారం, 1 డిశెంబరు 2015 (13:22 IST)
యంగ్ హీరోల్లో ఉయ్యాల జంపాలతో యాస భాషతో తెలుగు వెండితెరపైకి దూసుకొచ్చిన రాజ్ తరుణ్, తను నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టడంతో తన పారితోషికాన్ని కూడా భారీగా పెంచేశాడని సమాచారం. ఇప్పటివరకూ రూ.30 లక్షలు ఇస్తే సరిపోతుందిలే అని చెప్పిన రాజ్ తరుణ్, కుమారి 21 ఎఫ్ ఇచ్చిన బూష్టుతో ఎకాఎకిన తన పారితోషికాన్ని రూ. కోటి చేసాడని ఫిలిమ్ నగర్ న్యూస్.
 
కొత్తగా అంగీకరించే సినిమాలకైతే ఫర్వాలేదు కానీ... తను ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని లైన్ పెట్టేశాడని సమాచారం. దీంతో రాజ్ తరుణ్ తో చిత్రాలు చేస్తున్న నిర్మాతలు లబోదిబోమంటున్నారట. ఇకపోతే ఇతడితో చిత్రాలు చేయాలనుకుంటున్న నిర్మాతలు తమ సంచులను ఒకసారి చెక్ చేసుకుంటున్నారట. మరికొందరైతే... అయ్యా నమస్కారం అంటూ తిన్నగా జారుకుంటున్నారట. మరోవైపు...ఈ హీరో మార్కెట్ అంత రేంజ్ పలుకుతుందా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu