Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'సర్దార్ గబ్బర్ సింగ్' నుంచి పవన్ 'దూకుడు'గా బయటకి... ప్రాజెక్ట్ ఏమవుతుంది...?

'సర్దార్ గబ్బర్ సింగ్' నుంచి పవన్ 'దూకుడు'గా బయటకి... ప్రాజెక్ట్ ఏమవుతుంది...?
, శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (21:38 IST)
అత్తారింటికి దారేది తర్వాత గోపాల గోపాల అంటూ కృష్ణావతారంలో కన్పించిన పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో కాస్త చికాకులు ఎదుర్కొంటున్నట్లు వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది. తాజాగా మరో గుసగుస వినబడుతోంది. అదేంటయా అంటే... సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేశాడట. 
 
దీనికి కారణం డైరెక్టర్ బాబీయేనని అనుకుంటున్నారు. జయన్ అనే సీనియర్ టెక్నీషియన్ విషయంలో బాబీ అనుసరిస్తున్న వైఖరి పవన్ కళ్యాణ్ కు ఎంతమాత్రం మింగుడుపడటం లేదట. దాంతో సినిమా షూటింగ్ విషయంలో పవన్ ఉత్సాహంగా ఉండటంలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి సర్దార్ గబ్బర్ సింగ్ బయటకు వస్తాడో లేదో...?

Share this Story:

Follow Webdunia telugu