Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాజీ భార్య రేణూ దేశాయ్‌తో పవన్ కళ్యాణ్ రెండుసార్లు... మిగిలిన హీరోయిన్లతో ఒకే ఒక్కసారి...

మాజీ భార్య రేణూ దేశాయ్‌తో పవన్ కళ్యాణ్ రెండుసార్లు... మిగిలిన హీరోయిన్లతో ఒకే ఒక్కసారి...
, శనివారం, 27 జూన్ 2015 (12:46 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలే వేరు. ఒకసారి నటించిన హీరోయిన్ తో మరోసారి నటించే అవకాశమే ఇవ్వడు. ఏదో అలా జరిగిపోయిందని అనుకోవాలో లేదంటే పవన్ కళ్యాణ్ సెంటిమెంటో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ నటించిన చిత్రాల్లో తన మాజీ భార్య రేణూ దేశాయ్ మాత్రమే ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్‌తో రెండుసార్లు నటించింది. మిగిలిన వారంతా దాదాపు ఒకే ఒక్కసారికే పరిమితమైపోయారు. 
 
తాజాగా పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ 2 చిత్రం నుంచి అనీషా అంబ్రోస్ తప్పుకుంది. కారణాలేమిటో తెలియదు కానీ ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రంలో నటించడంలేదు. దాంతో ఇప్పుడు సమంత, శృతి హాసన్ ఇద్దరూ గబ్బర్ సింగ్ 2 దర్శకుడిని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. తమ కాల్షీట్స్ ఎడ్జెస్ట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2లో నటించే ఛాన్స్ ఇస్తే నటిస్తామని అడుగుతున్నారట.
 
ఐతే పవన్ కళ్యాణ్ వీరి మాట విని రెండోసారి చాన్స్ ఇస్తే, మాజీభార్య రేణూ దేశాయ్‌తో ఉన్న రికార్డుకు సమానమవుతారు మరి. ఐతే పవన్ కళ్యాణ్ కొత్త హీరోయిన్ కోసం ముంబై వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ న్యూస్.

Share this Story:

Follow Webdunia telugu