Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విడాకులు మంజూరు కాలేదు.. కానీ ఓంపురి దంపతులు విడిపోయారు ఎలా?

విడాకులు మంజూరు కాలేదు.. కానీ ఓంపురి దంపతులు విడిపోయారు ఎలా?
, గురువారం, 11 ఫిబ్రవరి 2016 (13:00 IST)
బాలీవుడ్ విలక్షణ నటుడు ఓంపురి 65 ఏళ్ల వయస్సులో తన భార్య నుంచి చట్టపరంగా విడిపోయి అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే ఓంపురి దంపతులకు కోర్టు మాత్రం విడాకులు మంజూరు చేయలేదు. వీరిద్దరి మధ్య రాజీ కుదరడంతో కోర్టు వారికి 'జ్యుడీషియల్ సెపరేషన్' మాత్రం మంజూరు చేసింది. దీని ప్రకారం వాళ్లిద్దరూ చట్ట ప్రకారం భార్యాభర్తలుగానే ఉంటారుగానీ... వేర్వేరుగా జీవిస్తారు. ఒకరి వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు. ఈ మేరకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే తమ కొడుకు ఇషాన్ బాగోగులను మాత్రం ఇద్దరూ చూసుకునే విధంగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది.
 
ఓంపురి, నందితలు 26 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరి మధ్య మనస్ఫర్ధలు తలెత్తడంతో గత కొంతకాలంగా వేర్వేరుగా జీవిస్తున్నారు. అయితే తమకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు వీళ్లకు జ్యుడీషియల్ సెపరేషన్ విధానంలో చిన్న షరతు విధించింది. ఒకవేళ మళ్లీ ఈ దంపతులు తిరిగి ఎప్పుడు కలవాలన్న ఓ థర్డ్ పార్టీ సమక్షంలోనే ఆ తంతు పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని కోర్టు ఆదేశించింది. ఇకపోతే ఓంపురి తన కొడుకుని కలుసుకునేందుకు కోర్టు సదుపాయాన్నికల్పించింది.
 
చాలాకాలం పాటు ఎంతో అన్యోన్యంగా జీవించిన ఓంపురి నందితలకు గొడవలు రావడానికి కారణం ఓ పుస్తకమే ప్రధాన కారణం. 2009లో 'అన్ లైక్లీ హీరో.. ది స్టోరీ అఫ్ ఓంపురి' అంటూ ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని నందిత రాసి విడుదల చేశారు. అందులో ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయాలును నందిత వెల్లడించారు. ఇందులో ఓంపురి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని అభ్యంతరకర శృంగార ఘటనలను గురించి ప్రస్తావించారు. దీనిపై భార్యాభర్తలిద్దరి మధ్య వివాదం మొదలైంది. చివరికది ఇద్దరూ విడిపోవడానికి కూడా దారితీయడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu