Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అజిత్ ''వీరమ్''ను కాపీ కొట్టేసిన కాటమరాయుడు.. వేదాళం కూడా అదే బాటలోనే..?

కోలీవుడ్ అందాల హీరో అజిత్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాపీ కొట్టేస్తున్నాడు. తమిళ వీరమ్ సినిమానే కాటమరాయుడుగా రీమేక్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించకపోయినా.. దీపావళిని పురస్కరించుకుని విడుదలైన కాటమ

అజిత్ ''వీరమ్''ను కాపీ కొట్టేసిన కాటమరాయుడు.. వేదాళం కూడా అదే బాటలోనే..?
, మంగళవారం, 1 నవంబరు 2016 (16:40 IST)
కోలీవుడ్ అందాల హీరో అజిత్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాపీ కొట్టేస్తున్నాడు. తమిళ వీరమ్ సినిమానే కాటమరాయుడుగా రీమేక్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించకపోయినా.. దీపావళిని పురస్కరించుకుని విడుదలైన కాటమరాయుడు స్టిల్ మాత్రం.. తమిళ వీరమ్ పోస్టరును గుర్తు చేస్తోంది. దాంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత రీమేక్‌ అయితే మాత్రం పోస్టర్ దగ్గర నుంచి కాపీ కొట్టేయాలా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఇకపోతే.. కాటమరాయుడుకి మొదటి నుంచి కష్టాలు తప్పట్లేదు. సర్దార్ గబ్బర్ సింగ్‌కు తర్వాత మంచి హిట్ కొడదామనుకుంటే.. నెగటివ్ కామెంట్స్ వెల్లువల్లా వచ్చిపడుతున్నాయి. మొదట్లో ఈ సినిమాకు దర్శకుడిగా అనుకున్న ఎస్‌జే సూర్యను మార్చడం దగ్గర్నుంచి, షూటింగ్‌ వాయిదా పడుతూ రావడం, దర్శకుడు డాలీతో గొడవపడి పవన్‌ సెట్‌ నుంచి వెళ్లిపోవడం.. ఇలా ఏదో ఒక నెగిటివ్‌ న్యూస్‌ ఈ సినిమా గురించి వెలువడుతోంది.
 
తాజాగా దీపావళి నాడు విడుదల చేసిన పోస్టర్‌ గురించి కూడా నెగిటివ్‌ కామెంట్స్‌ వినబడుతున్నాయ్. రీమేక్ పేరిట వీరమ్ సినిమాను కాటమరాయుడు సూపర్‌గా కాపీ కొట్టేస్తున్నాడని సినీ జనంతో పాటు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ ఇకనైనా వీరమ్‌ను కాపీ కొట్టకుండా.. రీమేక్ చేస్తాడా? అనేది నిర్ణయించుకోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా బెస్ట్ ఫ్రెండ్ తాగుబోతు రమేష్ మాత్రమే : కమెడియన్ పృథ్వీ