Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నయనతార విఘ్నేష్‌ను కూడా వదిలేసిందట.. డోరతో బిజీ బిజీ..?

దక్షిణాది అగ్ర హీరోయిన్ అయిన నయనతార ప్రస్తుతం లవ్వాయణంలో బిజీ బిజీగా ఉంది. కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమాయణం బ్రేకప్ అయ్యాక.. దర్శకుడు విఘ్నేష్‌తో ప్రేమలో మునిగిపోయిన నయన.. ఆయన్ని కూడా వదిలేసిందని క

నయనతార విఘ్నేష్‌ను కూడా వదిలేసిందట.. డోరతో బిజీ బిజీ..?
, మంగళవారం, 14 మార్చి 2017 (15:26 IST)
దక్షిణాది అగ్ర హీరోయిన్ అయిన నయనతార ప్రస్తుతం లవ్వాయణంలో బిజీ బిజీగా ఉంది. కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమాయణం బ్రేకప్ అయ్యాక.. దర్శకుడు విఘ్నేష్‌తో ప్రేమలో మునిగిపోయిన నయన.. ఆయన్ని కూడా వదిలేసిందని కోలీవుడ్ జనం కోడైకూస్తోంది. నయన్‌ కెరీర్‌ ఆరంభంలో తమిళ హీరో శింబుతో ప్రేమాయణం సాగింది. ఇద్దరి మద్య ఘాటు ప్రేమ కథ సాగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల శింబుకు దూరమైపోయింది. 
 
ఆపై కొన్నాళ్ల తర్వాత నటుడు, దర్శకుడు, కొరియోగ్రఫర్‌ అయిన ప్రభుదేవాతో నయన్‌ లవ్వాయణం మొదలెట్టింది. వీరిద్దరు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. నయన్ కోసం ప్రభుదేవ తన భార్యకు విడాకు ఇచ్చేందుకు కూడా సిద్ధమైపోయాడు. ఆ సమయంలో ఏమైందో ఏమో కాని పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది. 
 
మళ్లీ కొన్నాళ్లకు విఘ్నేష్‌తో ప్రేమాయణం మొదలు పెట్టింది. వీరిద్దరు చాలా అన్యోన్యంగా కనిపించే వారు. విఘ్నేష్‌ను తన ఇంటికి తీసుకువెళ్లడం, విఘ్నేష్‌ ఇంటికి నయన్‌ వెళ్లడం జరిగింది. కానీ విఘ్నేష్ నుంచి నయన దూరం జరిగిపోయిందని.. ప్రస్తుతానికి అమ్మడు సినిమాలతో బిజీ బిజీగా ఉందని సినీ వర్గాల సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీనియర్ హీరో కూతురిపై దర్శకుడు తేజ కన్ను...!