Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త ప్రియుడి కోసం మళ్లీ క్రైస్తవ మతాన్ని స్వీకరించిన నయనతార..!

కొత్త ప్రియుడి కోసం మళ్లీ క్రైస్తవ మతాన్ని స్వీకరించిన నయనతార..!
, శనివారం, 21 నవంబరు 2015 (15:16 IST)
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తన నటన కంటే కూడా ప్రేమ వివాదాల ద్వారా ప్రత్యేక గుర్తింపును సంతరించుకున్న నటి నయనతార. ఈ మలయాళ కుట్టి తాజాగా మరోమారు వార్తలకెక్కింది. ప్రస్తుతం తన కొత్త ప్రియుడుతితో కలిసి విదేశీ బీచ్ రిసార్ట్స్‌లలో ఎంజాయ్ చేస్తున్న నయనతార.. ఇటీవలే తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. ఆ పుట్టినరోజునే ఇటలీలోని రోమ్‌ నగరంలో పోప్‌ సమక్షంలో ఆమె క్రైస్తవ మతం స్వీకరించినట్టు సమాచారం. గతంలో బాపు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన చిత్రం 'శ్రీరామరాజ్యం' చిత్రంలో సీత పాత్రను నయనతార పోషించింది. ఆ సమయంలో ఆమె హిందూ మతాన్ని స్వీకరించింది. 
 
ఈ నేపథ్యంలో తమిళ చిత్రం ‘నానుమ్‌ రౌడీదాన్‌’ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో నయనతార ప్రేమలో పడింది. వీరిద్దరు త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. దీనిపై తమిళ మీడియాతో పాటు.. కోలీవుడ్‌ కోడై కూస్తోంది. పైగా ఈ వార్తలను వీరిద్దరు ఖండించనూ లేదు, ధృవీకరించనూ లేదు. ఈ సమయంలో నయనతార మళ్లీ క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదంతా తన కొత్త ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ కోసం నయనతార మళ్లీ క్రైస్తవం పుచ్చుకుందని వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu