Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమలో అన్నయ్యతో పోటీపడలేను... జస్ట్ ఫాలో అవుతా : అఖిల్ అక్కినేని

టాలీవుడ్ టాప్ స్టార్స్ నాగచైతన్య, సమంతల విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వారి ప్రేమ విషయం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఈ ప్రేమజంట పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు పచ్చ జెండా

ప్రేమలో అన్నయ్యతో పోటీపడలేను... జస్ట్ ఫాలో అవుతా : అఖిల్ అక్కినేని
, బుధవారం, 21 సెప్టెంబరు 2016 (12:19 IST)
టాలీవుడ్ టాప్ స్టార్స్ నాగచైతన్య, సమంతల విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వారి ప్రేమ విషయం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఈ ప్రేమజంట పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు పచ్చ జెండా ఊపారు. ఇదిలావుంటే... గత ఏడాది మలయాళంలో విడుదలై సూపర్‌ హిట్‌ సాధించిన 'ప్రేమమ్‌' చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
కార్తికేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతుండగా, శృతి హాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా రిలీజైన 'ప్రేమమ్' చిత్రం ట్రైలర్ చూసిన అఖిల్... మా అన్నయ్య ప్యూరెస్ట్ లవర్ ఇన్ ది వరల్డ్ అని కితాబునిచ్చాడు. 
 
''ప్రేమమ్'' చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న అఖిల్ మాట్లాడుతూ, ''ప్రేమమ్'' చిత్రాన్ని మలయాళంలో తాను చూడలేదని, కనుక, తెలుగులో ''ప్రేమమ్''ను బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పాడు. ప్రేమ కథల విషయంలో అన్నయ్యతో తాను పోటీ పడలేనని, ఫాలో అయిపోతానని అఖిల్ అన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు".. కానీ సన్నీ అలా కాదు.. ఆ డాక్యుమెంటరీ భారత్‌లో రిలీజ్ కాదట..