Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''ట్యూబ్‌లైట్''లో చైనా అమ్మాయితో సల్మాన్ ఖాన్ రొమాన్స్.. కత్రినాకు నో ఛాన్స్!

''సుల్తాన్‌'' చిత్రంతో మాంచి ఊపుమీదున్న సల్మాన్ ఖాన్ నటిస్తున్న తదుపరి చిత్రం ''ట్యూబ్‌లైట్''. కబీర్‌ ఖాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కండ‌ల వీరుడు సల్మాన్‌ఖాన్‌, కబీర్‌ఖాన్‌ కలయికలో ఇది మూ

''ట్యూబ్‌లైట్''లో చైనా అమ్మాయితో సల్మాన్ ఖాన్ రొమాన్స్.. కత్రినాకు నో ఛాన్స్!
, గురువారం, 11 ఆగస్టు 2016 (11:12 IST)
''సుల్తాన్‌'' చిత్రంతో మాంచి ఊపుమీదున్న సల్మాన్ ఖాన్ నటిస్తున్న తదుపరి చిత్రం ''ట్యూబ్‌లైట్''. కబీర్‌ ఖాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కండ‌ల వీరుడు సల్మాన్‌ఖాన్‌, కబీర్‌ఖాన్‌ కలయికలో ఇది మూడో చిత్రం. ఈ ట్యూబ్‌లైట్  చిత్రంలో సల్మాన్‌ మానసికంగా ప్రత్యేక అవసరాలున్న వ్యక్తిగా నటిస్తున్నాడట. 1962 ఇండో చైనా యుద్ధ నేపథ్యంగా కథ సాగుతుందట. ఆ సమయంలో ఓ చైనా అమ్మాయితో ప్రేమలో పడిన వ్యక్తిగా సల్మాన్‌ పాత్ర ఉంటుందని బాలీవుడ్ వర్గాల విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
ఇటీవలే ఈ ట్యూబ్‌లైట్ షూటింగ్  లద్దాఖ్‌లో పారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు కబీర్‌ఖాన్‌ స్వయంగా ట్వీట్‌ చేశారు. భావోద్వేగాలకు పెద్దపీటవేస్తూ వినోదాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ట్యూబ్‌లైట్ అని ట్వీట్ చేశాడు. అయితే ఈ చిత్రంలో సల్లూభాయ్‌కి జంటగా ఎవరు నటించబోతున్నారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట్లో దీపిక, పరిణీతి, కత్రినా కైఫ్‌.. ఇలా ఎందరి పేర్లో వినిపించినా.. చివరికి ఆ అవకాశం మాత్రం చైనీస్‌ నటికి దక్కింది. చైనాకి చెందిన నటి జుజు సల్లూభాయ్‌కి జంటగా ట్యూబ్‌లైట్‌లో నటించనుంది. 
 
ఈ సినిమా కోసం హిందీ నేర్చుకోవడానికి జుజు వారం క్రితమే ముంబయి వచ్చేసిందని దర్శకుడు తెలిపారు. జుజు తన కెరీర్‌లో ''షాంఘై కాలింగ్''‌, ''ద మ్యాన్‌ విత్‌ ది ఐరన్‌ ఫిస్ట్స్''‌, ''వాట్‌ వుమెన్‌ వాంట్''‌, ''లాస్ట్‌ ఫ్లైట్‌'' లాంటి అంతర్జాతీయ చిత్రాల్లో నటించింది. సల్మాన్‌తో మొదటిసారి జుజు నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరస్తు శుభమస్తు హీరోయిన్ అంటే ఆమెకు ఎందుకంత ఇష్టం.. తెలుసుకోండి..!