Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆలస్యం చెయ్యకండి.. పెళ్లి చేసుకోండి.. సీనియర్‌లకు అమల పాల్ హితవు

ఆలస్యం చెయ్యకండి.. పెళ్లి చేసుకోండి.. సీనియర్‌లకు అమల పాల్ హితవు
, మంగళవారం, 28 అక్టోబరు 2014 (11:10 IST)
ఆలస్యం చెయ్యకుండా పెళ్లి చేసుకోండి... వైవాహిక జీవితంలోని ఆనందాన్ని రుచి చూడండి అంటూ పెళ్లి కానీ సీనియర్‌ హీరోయిన్లకు నటి అమలా పాల్ హితవు పలుకుతోంది. తాను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుపుతోంది.
 
చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అనతి కాలంలోనే నటిగా మంచి స్థాయికి చేరుకున్న అమలాపాల్ అతి తక్కువ కాలంలోనే ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యిపోయింది. నీలతారమ అనే మలయాళం సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయిన ఈ సుందరి ఆ తర్వాత కోలీవుడ్‌లో, టాలీవుడ్ అంటూ బహుబాషా నటిగా అగ్ర తారల సరసన చేరింది.
 
నాయక్, బెజవాడ, ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల అభిమాన్ని చూరగొన్న ఈ మలయాళీ ముద్దు గుమ్మ దర్శకుడు విజయ్‌ను ప్రేమించి జీవిత భాగస్వామిగా చేసుకుని సెటిల్ అయింది. మంచి అవకాశాలు వస్తే నటించేందుకు తాను సిద్దమే అంటున్న ఈ అమ్మడు ఇంకా పెళ్లి కాని హీరోయిన్లను త్వరగా పెళ్లి చేసుకుని భర్త, భాందవ్యాలు అంటూ వైవాహిక జీవితంలోని మధురానుభూతులను చచిచూడండి అంటూ హితబోధలు చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu