Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచు విష్ణుతో కుమార్తెల స్టెప్పులు.. సోషల్ మీడియాలో వైరల్

హీరో మంచు విష్ణు వివాహం వెరోనికా రెడ్డితో మార్చి 1, 2009న జరిగిన విషయం తెలిసిందే. మంచు విష్ణు నటించిన ఢీ సినిమాకు వెరోనికా కాస్టూమ్ డిజైనర్‌గా పని చేసిన సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్ద

మంచు విష్ణుతో కుమార్తెల స్టెప్పులు.. సోషల్ మీడియాలో వైరల్
, శుక్రవారం, 26 ఆగస్టు 2016 (17:41 IST)
హీరో మంచు విష్ణు వివాహం వెరోనికా రెడ్డితో మార్చి 1, 2009న జరిగిన విషయం తెలిసిందే. మంచు విష్ణు నటించిన ఢీ సినిమాకు వెరోనికా కాస్టూమ్ డిజైనర్‌గా పని చేసిన సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ 2011లో ఈ దంపతులు ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఒకరి పేరు అరియానా, మరొకరి పేరు వివియానా. 
 
కాగా ఈ హీరో సోషల్‌మీడియా ద్వారా తన పిల్లలతో ఉన్న ఒక వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు. అందులో ఆయన తన ఇద్దరు కుమార్తెలు వివియానా, అరియానాకు మంచు విష్ణు డ్యాన్స్‌ నేర్పిస్తూ.. వారితో స్టెప్పులేయిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 
 
ఇద్దరు పిల్లలు కూడా తండ్రిని స్టెప్పు ఫాలో అవుతూ పోటాపోటీగా డ్యాన్స్‌ చేస్తున్నారు. తన భార్య విరానికా షాపింగ్‌కి వెళ్లినప్పుడు పిల్లల్ని ఇలా చూసుకుంటానని చెబుతూ విష్ణు తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ఆ చిన్నారులు వేస్తున్న స్టెప్పులు చూస్తే ఎవ్వరికైనా ముచ్చటేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కెర్లు కొడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేయసి కావాలట... స్నేహితుడూ కావాలట... ఎందుకట...? '100 డేస్‌ ఆఫ్ లవ్‌' చూడాలట... రివ్యూ రిపోర్ట్