Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సన్నీ లియోన్‌కు మంచు మనోజ్ రూ.75 లక్షలు.. అందుకే ఇచ్చారా? లేక....

సన్నీ లియోన్‌కు మంచు మనోజ్ రూ.75 లక్షలు.. అందుకే ఇచ్చారా? లేక....
, మంగళవారం, 21 అక్టోబరు 2014 (10:44 IST)
'కరెంట్ తీగ' చిత్రంలో పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నటించనుంది. ఈ చిత్రంలో హీరో మంచు మనోజ్‌తో కూడా ఓ పాటలో డ్యాన్స్ చేయనుంది. ఈ పాట కోసం సన్నీ లియోన్‌కు రూ.75 లక్షలు చెల్లించారట. మంచు మనోజ్ హీరోగా నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'కరెంట్ తీగ' సినిమాలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని తాజాగా మనోజ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. 
 
సన్నీ లియోన్ ఐటెం సాంగ్ తొలిసారిగా చేసిన స్ట్రెయిట్ తెలుగు సినిమా 'కరెంట్ తీగ'. దాంతో ఆమెకు ఎంతిచ్చారు? అన్న విషయంపై మొదటి నుంచీ రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ మనోజ్ అసలు విషయాన్ని వెల్లడించాడు. రూ.75 లక్షలు తీసుకున్నప్పటికీ ఆమె వల్ల సినిమాకు ఆమాత్రం ప్రయోజనం ఉంటుందని చెప్పుకొచ్చాడు. 
 
అయితే, అసలే మంచి ఊపుమీద ఉన్న మంచు మనోజ్.. సన్నీ లియోన్‌కు అంత మొత్తంలో డబ్బులు ఎందుకు చెల్లించారన్న దానిపై పలు రకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ చిత్రంలో నటించినందుకే ఆ మొత్తం చెల్లించారా? లేక మరోదాని కోసం చెల్లించారా అనేది చిత్రం విడుదలైన తర్వాత గానీ తెలియదు. కాగా, ఈ చిత్రం ఈ నెల 31వ తేదీన విడుదల కానుంది. 

Share this Story:

Follow Webdunia telugu