Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జస్ట్ నటిస్తున్నాం.. మా ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ లేదు.. రియల్ లైఫ్‌లో ప్రేమలో ఉన్నా...అనుష్క శర్మ

రణ్‌బీర్ కపూర్, అనుష్క శర్మ జంటగా ''యే దిల్‌ హై ముష్కిల్'' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది. కాగా ఈ చిత్రం లో రణ్‌బీర్, అనుష్క శర్మ లిప్ లాక్ సీన్లలో

జస్ట్ నటిస్తున్నాం.. మా ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ లేదు.. రియల్ లైఫ్‌లో ప్రేమలో ఉన్నా...అనుష్క శర్మ
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (09:11 IST)
రణ్‌బీర్ కపూర్, అనుష్క శర్మ జంటగా ''యే దిల్‌ హై ముష్కిల్'' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది. కాగా ఈ చిత్రం లో రణ్‌బీర్, అనుష్క శర్మ లిప్ లాక్ సీన్లలో అదరగొట్టారు. ఇంకా ఈ చిత్రంలో ఇద్దరి మధ్య లిప్ లాక్ సన్నివేశాలున్నాయట. లిప్ లాక్ సీన్స్ మీకు ఇబ్బందిగా అనిపించవా? అనే ప్రశ్నకు అనుష్క శర్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
"నటిస్తున్నాం.. అంతకు మించి ఏమీ లేదని రణ్‌బీర్ కపూర్, నేనూ అనుకుంటాం. అందుకే మా కెమిస్ట్రీ బాగుంటుంది. రియల్ లైఫ్‌లో నేను కూడా ప్రేమలో ఉన్నాను కదా' అని చెప్పింది. ఇదిలావుంటే... రియల్ లైఫ్‌లోరణ్‌బీర్‌ కపూర్‌ చాలా రొమాంటిక్‌ట. ఎందుకంటే... ఆయన ప్రేమకథా చిత్రాల్లోనే ఎక్కువగా నటించడంతో పాటు నిజజీవితంలోనూ దీపికా పదుకొణె, కత్రినా కైఫ్‌లతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. 
 
ఇప్పుడు ఐశ్వర్య రాయ్‌, అనుష్క శర్మలతో ప్రేమలో పడ్డాడు రణ్‌బీర్‌. దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ తెరకెక్కిస్తున్న ప్రేమకథా చిత్రం "యే దిల్‌ హై ముష్కిల్''లో కథానాయకుడిగా నటిస్తున్న రణ్‌బీర్‌ అందులో ఐశ్వర్య రాయ్‌, అనుష్క శర్మలతో రొమాన్స్‌ చేస్తున్న విషయం తెలిసిందే. 
 
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో రణ్‌బీర్‌, ఐశ్వర్య, అనుష్క మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలు కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి. లవర్‌బోయ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రణ్‌బీర్‌ ప్రేమ గురించి మాట్లాడుతూ ''నేనో రొమాంటిక్‌ పర్సన్‌ని. ప్రేమంటే ఏంటని నన్నడిగితే అదో వింత వ్యసనం. మన అధీనంలో లేని మధుర భావన. అది ఎవరూ నిర్వచించలేని మానసిక స్థితి'' అని వెల్లడించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుజీత్ దర్శకత్వంలో నటించనున్న ప్రభాస్... బాహుబలి తర్వాత...