Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్టీఆర్, సమంత నాల్గోసారి...

ఎన్టీఆర్, సమంత నాల్గోసారి...
, శుక్రవారం, 27 నవంబరు 2015 (22:38 IST)
ఎన్టీఆర్‌, సమంత కాంబినేషన్‌లో ఇప్పటికే బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాలు వచ్చాయి. తాజాగా మరోసారి మెప్పించేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. 'శ్రీమంతుడు' తర్వాత టాలీవుడ్‌లో టాప్‌ దర్శకుల్లో ఒకరుగా చేరిపోయిన కొరటాల శివ, తన తదుపరి సినిమాను ఎన్టీఆర్‌తో సిద్ధం చేసిన విషయం తెలిసిందే. 
 
మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో రూపొందననున్న ఈ సినిమాలో సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ ఓ ప్రధాన పాత్రలో నటిస్తుండగా తిరు, దేవిశ్రీప్రసాద్‌ లాంటి టాప్‌ టెక్నీషియన్స్‌ పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్స్‌కి తోడు సమంత కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. 
 
ఎన్టీఆర్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు సమంతను కొరటాల శివ సంప్రదించగా, కథ విన్న ఆమె వెంటనే ఈ ప్రాజెక్టును ఓకే చేసేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ ప్రస్తుతం చేస్తోన్న 'నాన్నకు ప్రేమతో' పూర్తయ్యాక కొరటాల శివ సినిమాను మొదలుపెట్టనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu