Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కత్రినా కైఫ్ మరో బాయ్ ఫ్రెండును పట్టిందా...? ఆకాష్ అంబానీతో కలిసి?

బాలీవుడ్‌లో ప్రేమాయణాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ తారల ప్రేమాయణాలు ఎప్పుడు చిగురిస్తాయో.. ఎప్పుడు బ్రేకప్ అవుతాయో అనేది తెలియదు. తాజాగా రణ్‌బీర్‌తో బ్రేకప్‌ అయిన వార్తలు ఇంకా హల్‌చల్‌ చేస్తుండగానే మరోసారి కత్రీనా కైఫ్ వార్త

కత్రినా కైఫ్ మరో బాయ్ ఫ్రెండును పట్టిందా...? ఆకాష్ అంబానీతో కలిసి?
, బుధవారం, 9 నవంబరు 2016 (16:00 IST)
బాలీవుడ్‌లో ప్రేమాయణాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ తారల ప్రేమాయణాలు ఎప్పుడు చిగురిస్తాయో.. ఎప్పుడు బ్రేకప్ అవుతాయో అనేది తెలియదు. తాజాగా రణ్‌బీర్‌తో బ్రేకప్‌ అయిన వార్తలు ఇంకా హల్‌చల్‌ చేస్తుండగానే మరోసారి కత్రీనా కైఫ్ వార్తల్లోకెక్కింది. రిలయన్స్‌ సంస్థల అధినేత ముఖేశ్‌ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీతో కత్రినా కైఫ్ ఓ పార్టీలో కలిసి కనబడటంతో తేడా వార్తలు మొదలయ్యాయి.
 
ఇంతకీ విషయం ఏంటయా అంటే, దీపావళి పండుగ రోజున బిగ్‌బి అమితాబ్‌ ఇంట్లో గ్రాండ్‌గా నిర్వహించిన పార్టీకి అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. ఈ పార్టీకి ఆకాశ్‌ అంబానీ, కత్రినాలు కలిసి ఒకే కారులో వచ్చారని బిటౌన్ జనం చెప్తున్నారు. అదే కారులోనే పార్టీ పూర్తయ్యాక ఇద్దరూ కలిసే వెళ్ళారని కూడా గుసగుసలు పోతున్నారు. ఇక అనిల్‌ కపూర్‌ ఇంట్లో పార్టీకి కత్రినా మాజీ ప్రేమికుడు రణ్‌బీర్‌ కూడా వచ్చాడు. కానీ కత్రినా మీడియా కంట పడకుండా కాస్త దూరంగా ఉన్నట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు- కొరటాల కాంబోలో రెండో సినిమా.. ''భరత్ అను నేను'' అనేదే టైటిలా?