Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"కత్తి" తొలి రోజు కలెక్షన్స్ అదుర్స్... రూ.15.4 కోట్లు వసూలు

, గురువారం, 23 అక్టోబరు 2014 (18:51 IST)
తమిళ హీరో విజయ్ - సమంత జంటగా మురుగదాస్ దర్శకత్వంలో తాజా చిత్రం కత్తి. ఈ చిత్రం దీపావళికి విడుదలైంది. ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుంచి అనేక వివాదాల్లో చిక్కుకుంది. 
 
ఈ చిత్రం శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే బంధువుకు చెందిన లైకా ప్రొడక్షన్స్ నిర్మించడంతో విడుదల సమయంలో పెద్ద వివాదాన్నే రేపింది. చిత్రాన్ని విడుదల కానీయమంటూ తమిళ సంఘాలు పెద్ద ఎత్తున థియేటర్ల వద్ద ఆందోళన నిర్వహించగా, చెన్నైలో రెండు థియేటర్ల అద్దాలను సైతం ధ్వంసం చేశారు. 
 
ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చొరవతో సమస్య పరిష్కారమై, ప్రశాంత వాతావరణంలో సినిమా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఈ చిత్రం తొలి రోజునే కలెక్షన్ల వర్షం కురిపించింది. 
 
ఒక్క రోజులోనే ఈ సినిమా 15.4 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 70 కోట్ల బడ్జెట్టుతో నిర్మించిన ఈ చిత్రానికి ఈ వివాదం తోడు కావడంతో ప్రేక్షకులు చిత్రాన్ని చూసేందుకు థియేటర్లకు పోటెత్తడంతో కాసుల వర్షం కురుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu