Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిక్-2 కళ్యాణ్ కొంప ముంచిందట... 10 కాస్త 15 కోట్లు అవుతోందట.. నష్టం..

కిక్-2 కళ్యాణ్ కొంప ముంచిందట... 10 కాస్త 15 కోట్లు అవుతోందట.. నష్టం..
, శుక్రవారం, 28 ఆగస్టు 2015 (11:20 IST)
చిత్రపరిశ్రమలో మంచివాడుగా పేరున్న నందమూరి కళ్యాణ్ రామ్‌ను కిక్-2 ఘోరంగా దెబ్బతీసిందట. పెట్టుబడికంటే రాబడి గణనీయంగా పడిపోయిందట. హిట్ అయ్యిందని చెబుతున్నా నష్టాలు తప్పడం లేదని వాపోతున్నాడట. ఆ నష్టం స్కేలు ఇంచుమించు రూ. 10 నుంచి 15 కోట్లు ఉండవచ్చునట. 
 
నిజానికి కిక్ 2 మీద కళ్యాణ్ రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. పటాస్‌కు ముందు కళ్యాణ్ చాలా దెబ్బలు తిన్నాడు. అయితే తనకు వ్యక్తిగతంగా ఉన్న పేరుతో నిలదొక్కుకున్నాడు. పటాస్‌తో లాభాలు కళ్ల చూసాడు. కానీ కిక్ 2 మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. రూ. 40 కోట్ల వరకు ఖర్చు చేసేసాడట. ఈ విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డిని గుడ్డిగా నమ్మి, తన పరిస్థితి ఏమిటో చూసుకోకుండానే, రవితేజ మార్కెట్ ను కూడా పట్టించుకోకుండా ఖర్చు చేసేశాడట. 
 
అంచనాలు లేకుండా ఖర్చు చేయడంతో కళ్యాణ్ రామ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. రూ. 20 నుంచి 25 కోట్లలో సినిమా పూర్తి చేసి ఉంటే ఇంత ఘోరంగా దెబ్బ తిని ఉండేవాడు కాదని విశ్లేషకులు చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ రికవరీ కావాలంటే కాస్త టైమ్ పడుతుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu