Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేపిస్ట్ హీరో... కాజల్ హీరోయిన్... ఎలా ఒప్పుకుందబ్బా...?!!

రేపిస్ట్ హీరో... కాజల్ హీరోయిన్... ఎలా ఒప్పుకుందబ్బా...?!!
, మంగళవారం, 29 జులై 2014 (15:14 IST)
రేపిస్ట్, అత్యాచారం కేసుల్లో ఇరుక్కున్న మగాళ్లంటే అమ్మాయిలు అతడి వైపు కన్నెత్తి కూడా చూడరు. అలాంటిది ఏకంగా రేప్ కేసులో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవించిన ఓ రేపిస్ట్ హీరో షినీ ఆహుజా సరసన హాట్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించేందుకు సై అనేసింది. దీనితో ఇపుడు బాలీవుడ్ సినీజనం కాజల్ ను చూసి ముక్కున వేలేసుకుంటున్నారట. బాలీవుడ్ పెద్దపెద్ద హీరోయిన్లే తప్పుకుంటుంటే కాజల్ అగర్వాల్ మాత్రం సై అంటూ ముందుకు దూకేసిందట.
 
సుధీర్ మిశ్రా తెరకెక్కించనున్న 'ఔర్ దేవదాస్' చిత్రంలో కాజల్ ఈ రేపిస్ట్ హీరోతో యాక్ట్ చేయబోతోంది. తొలుత ఈ పాత్ర కోసం చిత్రాంగద సింగ్ అనుకున్నారట. మరి ఆమె ఏం మెలిక పెట్టిందో ఏమోగానీ సడెన్ గా కాజల్ అగర్వాల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఐతే కాజల్ ఎలాంటి సంకోచమూ లేకుండా సదరు రేపిస్ట్ హీరోతో చేసేందుకు ఒప్పేసుకున్నదట.
 
ఈ షినీ అహుజా తన వద్ద పని చేసే అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడనీ అతడిపై అభియోగాలు వచ్చాయి. ఈ కేసులో అతడు శిక్ష కూడా అనుభవించాడు. శిక్ష అనుభవించేశాడు కాబట్టి అతడితో చేస్తే ఏం ఫర్లేదు అనుకుందేమో కాజల్...!!

Share this Story:

Follow Webdunia telugu