Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమంత హైలెవల్... కాజల్ లోలెవల్... ఐనా ఒప్పుకుందట...

సమంత హైలెవల్... కాజల్ లోలెవల్... ఐనా ఒప్పుకుందట...
, బుధవారం, 1 జులై 2015 (14:19 IST)
ఇటీవల పూర్తిగా అవకాశాలు తగ్గిపోయిన నటిగా కాజల్‌ అగర్వాల్‌ పేరు విన్పిస్తోంది. గతంలో ఆమెతో నటించని కథానాయకుడు లేడు. కానీ ఆ తర్వాత హఠాత్తుగా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇతర భాషల్లో చేస్తుందని ఇక్కడ ప్రచారం చేస్తున్నా... ఆమె కెరీర్‌ మందకొడిగానే వుందని అర్థమవుతోంది.
 
ఇప్పటి కొత్త తరంతో పోటీ పడలేకనో, కొత్త ఒక వింతగా దర్శక నిర్మాతలు భావించడం వల్లనో ఆమెకు ఛాన్స్‌లు లేవు. అటువంటిది.. మహేష్‌ బాబు పక్కన బ్రహ్మూత్సవంలో నటించే ఛాన్స్‌ వచ్చింది. కానీ ఇందులో సమంత తర్వాత స్థానం ఆమెది. అంటే సెకండ్‌ హీరోయిన్‌. దీనికైనా ఆమె అంగీకరించిందంటే.. ఆమె కెరీర్‌ ఏ స్థాయికి చేరిందో అని గుసగుసలాడుకుంటున్నారు. కాగా, టెంపర్‌ సమయంలోనే కాజల్‌.. ఓ సందర్భంలో మాట్లాడుతూ... ఈ రంగంలో ఎంతకాలం వుంటానో చెప్పలేను కానీ, వున్నంతకాలం నాకిచ్చిన పాత్రకు న్యాయం చేస్తానని తెలియజేసింది.

Share this Story:

Follow Webdunia telugu